చాలామంది పాములు( Snakes ) చూడగానే దూరం పరిగెడతాము.అందులో నాగుపాములకు సంబంధించి విషమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వాటిని చూడటానికె ఎంతో భయపడతాం.అలాంటిది ఓ కుటుంబం ఏకంగా నల్ల త్రాచుకు ఓ ప్లేట్లో ఉంచి దానికి పూజలు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూజలు చేసే కార్యక్రమం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ పూజలు ఎప్పుడు, ఎక్కడ జరిగాయోన్న విషయం మాత్రం తెలియ రాలేదు.
ఇకపోతే ఈ వీడియోని గమనించినట్లైతే ఈ పూజలు శివరాత్రి( Maha Shivratri ) సందర్భంగా జరిగినట్లుగా అర్థమవుతుంది.ఈ వీడియోలో కనిపిస్తున్న ఓ వెడల్పు గల పాత్రలో పామును ఉంచి దాని చుట్టూ కుటుంబ సభ్యులు అంతా కూర్చున్నారు.ఇక్కడ విశేషమేంటంటే… పాము పక్కన అర్చకుడు కూడా మంత్రాలు చదువుతూ ఉండడం గమనార్హం.ఇకపోతే పూజ సమయంలో పాము మీద కుటుంబ సభ్యులు పాలు పోశారు.ఆ సమయంలో పాము వారిపై కాస్త కోపంగా చూసినా., దానికి వారు ఏ మాత్రం భయపడలేదు.
అలా ఓసారి కాటేసేందుకు ప్రయత్నించిన వారు ఎక్కడ వెనక్కి తగ్గకుండా పూజలు చేశారు.
హిందూ సంస్కృతిలో నాగదేవతకు, శివుడికి ఉన్న ప్రత్యేక అనుభందం వల్ల ఇలాంటి పూజలు నిర్వహిస్తారు.మామూలుగా నాకు పంచమి రోజున హిందువులు పాములకు సంబంధించిన పుట్టల వద్ద పాలు పోయడం లేకపోతే దేవత విగ్రహాల మీద పాలు పోసి పూజలు చేయడం చూస్తూనే ఉంటాం.ఇక ఈ వైరల్ గా మారిన వీడియోని చూసి కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి ప్రాణం మీదకు తెచ్చే పూజలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరైతే శివరాత్రి కాబట్టి పాముని పూజించారు.ఒకవేళ నవరాత్రులు జరుగుతే., సింహాలను లేక పులులకు కూర్చోబెట్టి పూజలు చేస్తారా అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.