ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వైసీపీకే పడుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఓటు వేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు జగన్ పార్టీకే వేశామని చెబుతున్నారని తెలుస్తోంది.
80 నుంచి 85 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకే( YCP ) అనుకూలంగా ఉన్నారని ఈ ఓట్లన్నీ వైసీపీకే పోల్ అవుతున్నాయని సమాచారం.అయితే ప్రభుత్వ ఉద్యోగులు జగన్( Jagan ) వైపు మొగ్గు చూపడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూసిన సందర్భాలు ఉన్నాయి.ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో బాబు చేసిన సెటైరికల్ కామెంట్లను ప్రభుత్వ ఉద్యోగులు సులువుగా మరిచిపోలేరు.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పయోజనం చేకూరేలా బాబు ఎలాంటి హామీలను ప్రకటించలేదు.జగన్ ప్రకటించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ మాత్రం ఉద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ ను అందజేసే స్కీమ్ అని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.బాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఏరోజు సంతోషంగా లేరు.బాబు రూల్స్ అంటే చీదరించుకునే ఉద్యోగులు చాలామంది ఉన్నారు.

మరోవైపు చంద్రబాబు( Chandrababu ) ప్రకటించిన హామీలు అలివి కాని హామీలు అని ఆ హామీలను అమలు చేస్తే ప్రతి నెలా కాదు కదా అసలు జీతాలే రావేమో అనే భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది.అందువల్ల వైసీపీకే అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని ఫ్యాన్ గుర్తుకు భారీగా ఓట్లు పోల్ అవుతున్నాయని తెలుస్తోంది.బాబు పాలనకు, జగన్ పాలనకు తేడా గమనించిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి జై జగన్ అనడానికే సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో ఏపీలో వార్ వన్ సైడ్ అయిందని విశ్లేషకుల నుంచి సైతం కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.