విశ్వాసంగా ఉండే జీవి ఏదైనా ఉంది అంటే అది ఒక్క కుక్క మాత్రమే.చాలామంది ఇళ్లలో కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు.
కుక్కలను పెంచుకునే యజమానులకు వాటిపై ఎక్కువ ఆప్యాయత ఉంటుంది.కొందరైతే ఒక్కోసారి వారి ఇంట్లో వ్యక్తుల వారిని చూస్తారు.
మరికొందరు మనుషుల కంటే కుక్కలకు ఎక్కువగానే విలువ ఇస్తారు.ఒకవేళ కుక్కలకు ఏదైనా లేనిపోని అనారోగ్యం వస్తే మాత్రం తెగ అల్లాడిపోతారు.
తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ వ్యక్తి తను ఎంతో గారాబంగా పెంచుకున్న కుక్క కళేబరాన్ని చేత పట్టుకొని బోరున విలవిస్తూ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు.
అలా వచ్చిన ఆ పెద్దమనిషి చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు.
ఈ సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ( Chhattisgarh )చోటుచేసుకుంది.ఇకపోతే పోలీసులు తెలిపిన విషయం ప్రకారం.ఝార్ఖండ్ రాష్ట్రంలోని సూరజ్ పూర్ ( Surajpur in Jharkhand state )జిల్లా పొడి గ్రామానికి చెందిన శివమంగళ సాయి అనే ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు కుక్క కళేబరాన్ని తీసుకొని వచ్చి పెద్దగా రోదించాడు.
ఈ విషయం సంబంధించి తన కొడుకే కుక్కను చంపాడు అంటూ పోలీసులకు తెలిపాడు.శివమంగల్ చాలా సంవత్సరాలుగా కుక్కను పెంచుకుంటున్నాడు.శివమంగల్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు.అయితే వారిద్దరికీ తాను పెంచుకునే కుక్క అంటే ఇష్టం లేదు.
ఇటీవల తన కొడుకులలో ఒకరైన ‘సంత్ధాని’( Santdhani ) తాను ఇంట్లో లేని సమయం చూసి కుక్కను చంపాడు అంటూ పోలీసులకు వివరించాడు.ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అరెస్టు చేశారు.
అయితే కొడుకు చెప్పిందని ప్రకారం ఆ కుక్క తన తల్లిపై దాడి చేస్తుందన్న భయంతోనే చంపాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ విషయాన్ని శివమంగల్ వాదనను తోచిపొచ్చడం కోసమరుపు.
తన కుక్క ఎవరిని కరవదని, ఎవరిపై దాడి చేయదంటూ చెప్పాడు.
ఇకపోతే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.శివమంగల్( Shivamangal ) ఇంట్లో లేని సమయంలో అతని కుమారుడు కుక్కకు బంతి తీసుకురమ్మన్నాడని, అయితే ఆ కుక్క అతని మాట వినకపోవడంతో ఓ పదునైన పరికరంతో కుక్కను పొడిచి చంపారని తెలిపారు.దానితో అతనిపై 429 సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతో ఆ తర్వాత అతడు బెయిల్ పై బయటకు వచ్చాడు.