బాలీవుడ్ ఇండస్ట్రీలో షాహిద్ కపూర్( Shahid Kapoor ) కు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.షాహిద్ కపూర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
ప్రేమ పేరుతో నన్ను ఇద్దరు హీరోయిన్లు మోసం చేశారంటూ షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు.ఎన్నిసార్లు ప్రేమలో మోసపోయావ్ అనే ప్రశ్నకు ప్రేమ పేరుతో ఇద్దరు మోసం చేశారని ఆయన కామెంట్లు చేశారు.
వాటిలో ఒకదాని గురించి కచ్చితంగా చెప్పగలనని షాహిద్ అన్నారు.
రెండోదాని విషయంలో మాత్రం సందేహం ఉందని షాహిద్ కపూర్ వెల్లడించారు.
ఆ హీరోయిన్ల పేర్లు చెప్పమని అడగగా ఆ ప్రశ్నను మాత్రం షాహిద్ కపూర్ దాటవేశారు.షాహిద్ కపూర్ కు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఈ ప్రశ్నకు సమాధానం తమకు తెలుసంటూ నెటిజన్లు తమకు తోచిన పేర్లను రాసుకుంటున్నారు.
షాహిద్ కపూర్ ప్రస్తుతం రోషన్ ఆండ్రూ ( Roshan Andrew )డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
దేవ( Deva ) అనే సినిమాలో షాహిద్ కపూర్ నటిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం అందుతోంది.త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
షాహిద్ కపూర్ పారితోషికం గత కొన్నేళ్లలో భారీ రేంజ్ లో పెరిగిందని సమాచారం అందుతోంది.
విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న షాహిద్ కపూర్ తను నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే తన రేంజ్ ను మరింత పెంచుకునే ఛాన్స్ అయితే ఉంది.షాహిద్ కపూర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సైతం పరవాలేదనే స్థాయిలో ఆదరణ దక్కుతోందని తెలుస్తోంది.సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న షాహిద్ కపూర్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.