కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలి:ధూళిపాల

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాల ధనుంజయనాయుడు ప్రభుత్వాన్ని కోరారు.శుక్రవారం కోదాడ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఇనుగుర్తి వెంకటరమణాచారి,బిసి సంక్షేమ సంఘం యువజన విభాగం నాయకుడు చిలకరాజు శ్రీనుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని నేటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని,ఆ మేరకు సత్వరమే కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం,నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 56 శాతం పదవులు కేటాయించాలని,కోదాడ మార్కెట్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

 State Government Should Commit To Caste Enumeration Dhulipala , Dhulipala , Stat-TeluguStop.com

జనాభా దాబాషా ప్రకారం కులగణన చేపడితే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని,76 సంవత్సరాలుగా దేశంలో బీసీలు వెనుకబాటు తనానికి గురవుతూనే ఉన్నారని అన్నారు.ఇప్పటికైనా పాలకులు పెద్ద మనసుతో కులగణన చేపట్టి జనాభా దాబాషా ప్రకారం ఏ కులానికి ఎంత శాత ఉన్నారో అంత శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీలను సామాజికంగా,ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కుకునేలా చూడాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత శాసనమండలి సభ్యులలో ఇద్దరిలో ఒకరికి బీసీలకు సీటు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు.ఇదే విధానాన్ని రాబోయే5 సంవత్సరాల పాటు కొనసాగించి బీసీలకు పెద్దపీట వేసి వారి ఉన్నతకి తోడ్పడాలని కోరారు.

నేడు కేంద్రంలో అధికారులు ఉన్న బిజెపి ప్రభుత్వం కుల గణన చేపట్టకుండా మోకా లడ్డుతోందని,కేంద్ర ప్రభుత్వం పచ్చి బీసీ వ్యతిరేక ప్రభుత్వమని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలంతా బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వెయ్యాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube