మహిళలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాలు దిగిపోవాలి

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో,దేశంలో రోజురోజుకు మహిళపై అత్యాచారాలు,ఎక్కువ జరుగుతున్నాయని, మహిళలకు రక్షణ ఇవ్వలేని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దిగిపోవాలని ప్రగతిశీల మహిళ సంఘము రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కె.రమ,చండ్ర అరుణ అన్నారు.

 Governments That Cannot Protect Women Must Step Down-TeluguStop.com

సోమవారం జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో జరిగిన ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు తీవ్రతరం అయ్యాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఎంతైనా ఉందని తెలిపారు.

సరూర్ నగర్ లో జరిగిన నాగరాజు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.నిందితులకు తక్షణమే శిక్షపడేలా చట్టాలు సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.

ఒక వైపు పెట్రోల్, డీజిల్,నిత్యవసర సరుకుల ధరలు పెరిగి పేద ప్రజలు ఇబ్బందులకు గురిఅవుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్సు ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ 100 గజాల స్థలం ఇవ్వాలని అన్నారు.

స్థలం ఉన్న పేద ప్రజలకు ఇల్లు నిర్మాణానికి 3లక్షల కాకుండా ఐదు లక్షలు ఇవ్వాలన్నారు.బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళ సంఘము జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక, దొంతమల్ల హేమలత,సంతోషినీ,జయమ్మ,శారద, కవిత,సుగుణమ్మ భద్రమ్మ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube