సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళా ఉచిత ప్రయాణంలో ఆది నుండి ఏదో ఒక రూపంలో రచ్చ జరుగుతూనే ఉంది.సీట్ల కోసం మహిళలు ఏదో ఒకచోట శిగపట్లకు దిగుతూనే ఉన్నారు.
తాజాగా బుధవారం సూర్యాపేట జిల్లా
కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం వెళుతుండగా సీట్ల కోసం మహిళకు గొడవపడగా బస్సులో ఓ వ్యక్తి వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇదిలా ఉంటే కోదాడ నుండి ఖమ్మం, ఖమ్మం నుండి కోదాడకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఇబ్బంది అవుతుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.