సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని కేంద్రంలోని 32వ వార్డులో నిర్మిస్తున్న ఒక అపార్ట్మెంట్లో సుతారిమేస్త్రిగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డాలు శ్రీకాంత్ (32) ఈ నెల 8న మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.సందర్భంగా తన ఇద్దరు పిల్లలతో మృతిని భార్య, ఆసుపత్రికి చేరుకొని శోకసంద్రంలో మునిగిపోయింది.
ఈ సమయంలో అభంశుభం తెలియని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మా ఆకలి అవుతుంది… నాన్న ఎక్కడమ్మా…అంటూ అడిగిన విషాద సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది.అసలేం జరిగిందంటే…జిల్లా కేంద్రంలో నిర్మించే అపార్ట్మెంట్ లో వివిధ రాష్ట్రాల నుంచి 30 మంది సుతారి మేస్త్రిలను తీసుకొచ్చి పని చేయిస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం మంగళవారం శ్రీకాంత్ అనుమానస్పద మృతి చెందాడు.
అయితే తన భర్తది సహజ మరణం కాదని,వాచ్మెన్ దంపతులు,బిల్డింగ్ యజమాని కలిసి హత్య చేశారని మృతిని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించి,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తరలించారు.పోస్ట్ మార్టం ఆలస్యం కావడంతో రెండు రోజులుగా మృతిని కుటుంబ సభ్యులు చిన్నచిన్న పిల్లలతో ఆసుపత్రిలోనే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మృతిని భార్య బిల్డింగ్ యాజమాన్యం నుండి తమకు న్యాయం జరిపించాలంటూ రోధిస్తుండగా ఇద్దరు చిన్నారులు అమ్మా ఏమైంది?నాన్న ఎక్కడ? ఆకలి అవుతుంది,దోమలు కరుస్తున్నాయని చాలా దీనగా అంటున్న మాటలకు చూపరులు కంటతడి పెట్టుకున్నారు.ప్రభుత్వ అధికారులు బిల్డింగ్ యాజమాన్యంతో మాట్లాడి తక్షణమే వారికి న్యాయం చేసి స్వస్థలానికి పంపిస్తే ఏమైందని శాపనార్థాలు పెట్టారు.







