మ‌తిమ‌రుపు వేధిస్తుందా..రొయ్య‌లను ఇలా తింటే స‌రి!

వ‌య‌సు పైబ‌డే కొద్ది మానసిక సామర్థ్యం త‌గ్గుతూ ఉంటుంది.దాంతో మ‌తిమ‌రుపు రావ‌డం స‌ర్వ సాధార‌ణం.

 Prawns Help To Get Rid Of Forgetfulness! Prawns, Forgetfulness, Benefits Of Praw-TeluguStop.com

కానీ, ఈ మ‌ధ్య కాలంలో చిన్న వ‌య‌సులోనే మ‌తి మ‌రుపు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.అధిక ఒత్తిడి, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, స్మోకింగ్ అల‌వాటు, మ‌ధ్య‌పానం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ఆహార‌పు అల‌వాట్లు, డిప్రెష‌న్‌, పోష‌కాల లోపం, థైరాయిడ్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌తిమ‌రుపు వేధిస్తుంటుంది.

దాంతో మ‌తిమ‌రుపును నివారించుకునేందుకు హాస్ప‌ట్స్ చుట్టూ తిరుగుతుంటారు.

అయితే కొన్ని కొన్ని ఆహారాల ద్వారా సులువ‌గా మ‌తిమ‌రుపుకు బై బై చెప్పొచ్చు.

అలాంటి ఆహారాల్లో రొయ్య‌లు కూడా ఉన్నాయి.అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండే రొయ్య‌ల్లో.

విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, విట‌మిన్ డి, ప్రొటీన్‌, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, సెలీనియం, పొటాషియం, రాగి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఎన్నో పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.అందుకే రొయ్య‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

ముఖ్యంగా మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు వారానికి రెండు సార్లు రొయ్య‌ల‌ను తీసుకోవాలి.తిన‌మ‌న్నారు క‌దా అని.రొయ్య‌ల‌ను ఫ్రై చేసుకుని తింటారు కొంద‌రు.

Telugu Benefits Prawns, Boiled Prawns, Eat Prawns, Forgetfulness, Tips, Latest,

అలా చేస్తే రొయ్య‌ల్లో ఉండే పోష‌కాల‌న్నీ పోతాయి.అందువ‌ల్ల‌ రొయ్య‌ల‌ను ఉడికించి తీసుకోవాలి.అప్పుడే మతిమరుపు తగ్గి, జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది.

రొయ్య‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు త‌గ్గ‌డంతో పాటు.ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.ర‌క్త హీన‌త దూరం అవుతుంది.

అలాగే రొయ్య‌ల్లో సెలీనియం ఉంటుంది.ఇది శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా పోరాడుతుంది.

ఇక రొయ్య‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం కూడా ఎప్పుడూ నిగ‌నిగ‌లాడుతూ ఉంటుంది.కాబ‌ట్టి, మ‌తిమ‌రుపు ఉన్న వారే కాదు.

అంద‌రూ రొయ్య‌ల‌ను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube