సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గట్టు సమీపంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను గురువారం పోలీసులు అదుపులోకితీసుకున్నరు.హుజూర్ నగర్ ఎస్ఐ అనీల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సీతారాంనగర్ కు చెందిన గధరబోయిన పవన్ కుమార్(22) గుంటి గోపాలకృష్ణ (20) ఇద్దరు వ్యక్తుల నుండి 600 గ్రాముల గంజాయిని నియోజకవర్గ పరిధిలోని రామస్వామి గట్టు దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ రమణ దగ్గర కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు రమణ పరారీలో పరారీలో ఉన్నట్లు తెలిపారు.







