హువావే కంపెనీ తాజాగా తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘హువావే పాకెట్ ఎస్’ను చైనాలో రిలీజ్ చేసింది.ఈ మొబైల్ హార్మొనీ ఓఎస్ 3, స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో వర్క్ అవుతుంది.ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు.అలానే 40-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఆఫర్ చేశారు.40W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోల్డబుల్ ఫోన్ 4,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అందిస్తుంది.
చైనాలో హువావే పాకెట్ S ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్ విండో ఇప్పటికే స్టార్ట్ అయింది.నవంబర్ 10 నుంచి ఈ మొబైల్ డెలివరీలు ప్రారంభమవుతాయి.హువావే పాకెట్ S ఫోన్ 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ 5,988 (సుమారు రూ.67,900) యెన్లుగా కంపెనీ నిర్ణయించింది.8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ 6,488 (దాదాపు రూ.73,600) యెన్ల ప్రైస్ ట్యాగ్‌తో వస్తుంది.8జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ 7,488 (దాదాపు రూ.84,900) యెన్లగా ఉంటుంది.ఫ్రాస్ట్ సిల్వర్, ఐస్ క్రిస్టల్ బ్లూ, మింట్ గ్రీన్, అబ్సిడియన్ బ్లాక్, ప్రింరోస్ గోల్డ్, సకురా పింక్ వంటి రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఇందులో 340 x 340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.04-అంగుళాల ఓఎల్ఈడీ ఔటర్ డిస్‌ప్లే ఉంది.ఈ మొబైల్‌లో 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేశారు.ఇది ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి.







