కాంగ్రెస్ నేతలకు జ్ఞానం, విజ్ఞానం, విచక్షణ లేదు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం,కుటుంబపాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 Brs Minister Jagadish Reddy Shocking Comments On Congress Leaders, Brs, Minister-TeluguStop.com

రాహుల్ కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతనే నని పేర్కోన్నారు.కుంభకోణాలకు,అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్నారు.

రాహుల్‌ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.పగలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన పగటి దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదువుతున్నారని విమర్శించారు.

కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారు.ఇంత అవినీతి జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం అన్నారు.

సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు.మోడీ దయా దాక్షిణ్యల మీద బతుకుంది గాంధీ కుటుంబమన్నారు.

బోఫోర్స్ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చరిత్ర గాంధీ కుటుంబానిదని, గుజరాత్ ఎన్నికల్లో అటువైపు చూడకపోవడమే కాంగ్రెస్, బీజేపీల లాలూచీ రాజకీయాలకు నిదర్శనం అన్నారు.తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతుర్రని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలకు జ్ఞానం,విజ్ఞానం, విచక్షణ లేదన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ బ్రతుకు నాశనం అయిందనే అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు.

కేసీఆర్ మీద మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మివేయడమే అన్నారు.కేసీఆర్ వల్లే తెలంగాణ ససశ్యామలం అయిందని, ఏ యాత్రను చివరి వరకు ముగించిన చరిత్ర రాహుల్ కు లేదన్నారు.

ఏ యాత్రలు బీఆర్ఎస్ జైత్రయాత్రను అపలేవన్నారు.తెలంగాణాలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అన్నారు.

కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్ అయితే,మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం కేసిఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఐదుగంటల కరెంట్, రైతులు పండించిన ధాన్యం కూడా కొనలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీదన్నారు.నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మెందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాల వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంధాల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube