ఎమ్మెల్యే సైదిరెడ్డికి మున్సిపల్ చైర్ పర్సన్ ఝలక్

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ) సోమవారం రాత్రి ఊహించని షాక్ తగిలింది.ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త గెల్లి రవి,చైర్ పర్సన్ గెల్లి అర్చన,21,22,24వార్డు కౌన్సిలర్లు గాయత్రి భర్త భాస్కర్,అమరబోయిన సతీష్,గుంజ భవాని భర్త విజయ్ ( Vijay )బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మూడో వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ ఎంపి,హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 Jhalak Is The Municipal Chair Person For Mla Saidireddy-TeluguStop.com

మున్సిపల్ చైర్ పర్సన్ నివాసానికి స్వయంగా వెళ్ళిన ఉత్తమ్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ పరిణామం హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీకి( BRS party ) పెద్ద ఎదురు దెబ్బగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్,కాంగ్రెస్ కౌన్సిలర్స్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube