పేట వ్యవసాయ మార్కెట్ లో వైఎస్ షర్మిల నిరసన

సూర్యాపేట జిల్లా:ప్ర‌జా ప్ర‌స్థానంలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ ను శుక్రవారం సందర్శించారు.వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్టా రాంరెడ్డి ఆధ్వర్యంలో రైతుల వడ్ల రాశుల వద్దకు వెళ్లి రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు.

 Ys Sharmila Protests At Peta Agricultural Market-TeluguStop.com

గత నాలుగైదు రోజులుగా మార్కెట్ ధాన్యం విక్రయాల ధరను అధికారులతో అడిగి తెలుసుకొన్నారు.అనంతరం మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులకు మద్దతు ధర చెల్లించాలని,వెంట వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్లోకి ధాన్యం తీసుకొచ్చిన వారిలో కేవలం ఇద్దరు ముగ్గురు రైతులకు మాత్రమే మద్దతు ధర చెల్లించి,మిగతా 600 మంది రైతులకు క్వింటాల్ కు 1,400 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతీ రైతుకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube