బడుగుల బ్రతుకులు మార్చేది బీఎస్పీనే: ఆర్ ఎస్ పి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల వలన బడుగు బలహీన వర్గాలకు వరిగేది ఏమీ లేదని,బీఎస్పీ నీలి జెండా,ఏనుగు గుర్తు మాత్రమే మన జీవితాల్లో వెలుగులు నింపుతుందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి,బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్.ఎస్.

 Bsp Is The One Who Changes The Lives Of The Poor: Rsp-TeluguStop.com

ప్రవీణ్ కుమార్ అన్నారు.బుధవారం కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలంలోకి ప్రవేశించిన బహుజన రాజ్యాధికార యాత్ర నర్సింహులగూడెం,రేపాల,కలకోవ గ్రామాల్లో కొనసాగి విజయరాఘవాపురం చేరుకుంది.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బీఎస్పీ జెండా దిమ్మెలను ఆయన ప్రారంభించి,జెండాలను ఆవిష్కరించారు.అనంతరం రేపాల గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రేపాల గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా ఇంకా బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ,అగ్రవర్ణ పేదల జీవితాల్లో ఏ మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లు వేశామని,అధికారం వారు అనుభవిస్తూ,అంధకారం మనకు మిగిల్చారని,ఆ అంధకారాన్ని ప్రారద్రోలేందుకే తాను ఐపీఎస్ కు రాజీనామా చేసి,బీఎస్పీ ద్వారా మీ మధ్యకు వచ్చానని స్పష్టం చేశారు.

అన్ని గుర్తులకు ఓటేసినా మారని మన జీవితాల్లో బహుజన రాజ్యాధికారం ద్వారా మార్పు తేవాలని ఏకైక లక్ష్యంతో ఏనుగు గుర్తుతో ఈ యాత్ర చేస్తున్నాని తెలిపారు.ప్రభుత్వ పెద్దలు మన డబ్బును మనకే తాయిలాలుగా ప్రకటించి,వారి జేబుల్లోంచి ఇస్తున్నట్లు మనల్ని మభ్య పెట్టి,ఓట్లు దండుకుంటున్నారని,ఆ విషయాన్ని అందరూ ఆలోచించాలని చెప్పారు.

దళితబంధు, కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ ఇస్తే జీవితాలు మారవని,అవి లేనప్పుడు మనం పెళ్లిళ్లు చేసుకోలేదా? బ్రతకాలేదా అని ప్రశ్నించారు.బ్రతుకులు మారాలంటే కావాల్సింది కానుకలు కాదని, రాజ్యాధికారం కావాలని,దాన్ని మీకు అందించాలనే రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తున్నానని అన్నారు.

రేపాల గ్రామ మరియు ఈ ప్రాంత సమస్యలను ప్రస్తావిస్తూ గ్రామీణ మండలానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న రేపాలను పరిపాలనా సౌలభ్యం కోసం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని,రేపాలలో వందల ఏళ్ల చారిత్రిక నేపథ్యం కలిగిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచి,పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని,గ్రామంలోని శాఖా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి,అందులో అన్ని రకాల పోటీ పరీక్షలకు పుస్తకాలు అందుబాటులోకి తేవాలని,ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి,సరిపడా ఉపాధ్యాయులను నియమించి,బలహీన వర్గాల పిల్లలకు ఆంగ్ల విద్యను అందుబాటులోకి తేవాలని, మొద్దుల చెరువు నుండి మోతె వరకు ఆర్ అండ్ బి రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని,రేపాల నుండి కలకోవ,రేపాల నుండి మాధవరం ఉన్న లింక్ రోడ్లను తారు రోడ్లుగా మార్చాలని,రేపాల నుండి నడిగూడెం శిధిలావస్థకు చేరుకున్న ఆర్ అండ్ బి రోడ్డును నూతనంగా నిర్మించాలని,గ్రామంలో శిథిలమైన పశువుల బందెల దొడ్డిని నూతనంగా నిర్మించాలని, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల పరీక్షలు చేసేలా వైద్య పరికరాలను,వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని,పశువుల వైద్యశాలలో శాశ్వత వైద్యాధికారిని నియమించాలని,ప్రధాన వీధుల్లో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఇళ్ళు,ఇళ్ల స్థలాలు లేని అన్ని కులాల ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలం,ఇళ్ళు మంజూరు చేయాలని పలు సమస్యలపై స్థానిక యువకులు వినతిపత్రం అందజేశారు.గ్రామస్తులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయన చదివి వినిపించారు.

తెలంగాణ వస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని అందరూ భావిస్తే 8 ఏళ్ళు అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అన్నారు.అందుకే మన గ్రామంలో ప్రతీ సమస్యకు పరిష్కారం అందాలంటే పేదలకు రాజ్యాధికారం అందించే బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి,ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటేయలని కోరారు.

బీఎస్పీ జిల్లా ఇంచార్జీ పిల్లుట్ల శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ఇంచార్జీ గుండెపంగు రమేష్, నియోజకవర్గ నాయకులు,మునగాల మండల నాయకులు,రేపాల గ్రామ బాద్యులు సోమపంగు కార్తీక్,సోమపంగు బాలు,జిల్లేపల్లి దుర్గారావు, సోమపంగు నాగరాజు,జిల్లేపల్లి ముఖేష్,వినయ్, చిర్రా గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube