సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దుకునేందుకు పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.పట్టణ ప్రగతి మొదటి రోజులో భాగంగా శుక్రవారం స్థానిక 9 వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ తో కలసి క్రీడా ప్రాంగణాన్ని,20లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆటలపోటీలను ప్రారంభించి,కొద్దిసేపు వాలీబాల్ ఆడి అందరిని అలరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు,పట్టణాలలో సమస్యలు పరిష్కరించేందుకు పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారన్నారు.
పట్టణ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములై తమతమ వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారులను,క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తుందన్నారు.
క్రీడా మైదానాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోని క్రీడల్లో ప్రతిభ కనబర్చి రాష్ర్టానికి పట్టణానికి మంచి పేరు తేవాలన్నారు.సూర్యాపేట పట్టణము అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
తడి పొడి చెత్తను వేరు చేసి వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న ఏకైక మున్సిపాలిటీ సూర్యాపేట కావడం అభినందనీయమన్నారు.పట్టణ ప్రజలంతా తడి పొడి చెత్తను వేరు చేయడంతో పాటు రోడ్లపై చెత్త లేకుండా ఎవరి ఇంటి ముందు వారు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
సూర్యాపేట పట్టణాన్ని సుందరమైన,ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల్ లలిత ఆనంద్,పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్,40వ వార్డ్ కౌన్సిలర్ తాహెర్ పాష,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉప్పల ఆనంద్,నీలాల లక్ష్మయ్య,మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డీ,ఈఈ జి.డి.కే.ప్రసాద్,డిఈ సత్యారావు,మెప్మా పిడి రమేష్ నాయక్,ఏఈ సుమన్,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,వార్డ్ ఆఫీసర్ ప్రసాద్,ఎఫ్ ఆర్ వో వసుంధర,9వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుండగాని నాగభూషణం,ప్రధాన కార్యదర్శి సాయి ప్రణయ్,ప్రచార కార్యదర్శి పందిరి సైదులు,యూత్ అధ్యక్షులు మచ్చ రాము,ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి,మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి రజిత,ఉపాధ్యక్షులు సప్పిడి ఆరోగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.