వేసవి కాలం ప్రారంభమైంది.మార్చి నెల నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
గతంలో కంటే ఈ సారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో.ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు.
అయితే వేసవిలో ఎవరైనా చల్ల చల్లగా ఉండాలనే కోరుకుంటారు.అందుకోసం ఏసీ గదుల్లో గడపటం, చల్లటి పానియాలు తీసుకోవడం చేస్తుంటారు.
అలాగే ఉదయం, సాయంత్రం స్నానానికి చల్లటి నీటినే వాడతారు.ఎవరో కొందరు మాత్రం వేసవిలోనూ వేడి నీటితో బాత్ చేస్తారు.
అసలు వేసవిలో వేడి నీటితో స్నానం చేయవచ్చా.చేస్తే ఏం అవుతుంది వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.వేసవి కాలంలో చల్లటి నీటి కంటే వేడి నీటితో స్నానం చేయడమే మంచిదని చెబుతున్నారు.
వేసవిలో మండే ఎండలు, చెమటలు, ఉక్కపోత వల్ల శరీరం తీవ్రంగా అలసిపోతుంటుంది.అయితే వేడి నీటితో స్నానం చేస్తే ఆ అలసట దూరం అవుతుంది.
కండరాలు రిలాక్స్ అవుతాయి.ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.

అలాగే వేసవి వేడి కారణంగా తరచూ తలనొప్పి వస్తుంటుంది.వేడి నీటితో బాత్ చేస్తే తలనొప్పి నుంచి సులభంగా బయట పడవచ్చు.గంటలు గంటలు ఏసీలో గడిపే వారు తప్పని సరిగా వేడి నీటితోనే స్నానం చేయాలి.ఎందుకంటే, ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వీటి నుంచి రక్షించడంలో వేడి నీటి స్నానం అద్భుతంగా సహాయపడుతుంది.అంతేకాదు, వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మలినాలు, అధిక జిడ్డు తొలగిపోతాయి.
రాత్రుళ్లు హాయిగా నిద్ర పడుతుంది.మరియు గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అయితే వేడి నీటి స్నానం మంచిదన్నారు కదా అని.మరిగే మరిగే నీటితో చేస్తే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి, గోరు వెచ్చని నీటినే స్నానానికి యూజ్ చేయాలి.