సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్న మందులు రోగుల రోగాలు నయం చేయడానికి ఉపయోగించకుండా దాచిపెట్టి సుమారు రూ.60 లక్షల విలువైన మందులను చెత్త కుండీలో వేసి కాల్చివేసిన సంఘటన తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం వెలుగు చూసింది.బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద ప్రజలు,ప్రైవేట్ ఆస్పత్రులకు పోయి లక్షలు ఖర్చు పెట్టుకొనే స్తోమత లేక ప్రభుత్వ దవాఖానకు వేస్తే సరైన చికిత్స,సరిపడా మందులు లేవని చెప్పి, ప్రభుత్వ వైద్యులు నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కి పంపి,ఇక్కడ ఉన్న మందులను నిరుపయోగంగా నిల్వ ఉంచి ఇలా తగుల పెట్టడాన్ని స్థానికులు తీవ్రంగా పరిగణించారు.
ప్రభుత్వ దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం డాక్టర్లు హాస్పిటల్ కి వివిధ రోగాలతో వచ్చే వారికి ఇవ్వాల్సిన మెడిసిన్ ( మందులు)ఇవ్వకుండా వారికి ఇచ్చే మెడిసిన్ కాలం చెల్లేంత వరకు పాత పడాపడ్డ రూములో స్టోర్ చేసి,కాల్చి వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మందులు ఎందుకు కాలం చెల్లే వరకు రోగులకు అందివ్వలేదనేదిజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్రమైన విచారణ జరిపి,దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రుల మీద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి,ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని ఉద్యోగం నుండి తొలగించాలని కోరారు.
మంత్రి,ఎమ్మెల్యే పర్యటన ఉండటమే కారణమా?తుంగతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాల్చివేసిన మందులు 2020,2022 నాటికీ కాలం చెల్లినవి కావడం గమనార్హం.ఫిబ్రవరి నెల చివర్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి హాస్పిటల్ నూతన బిల్డింగుకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్న నేపథ్యంలో రెండు మూడు రోజులలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆసుపత్రి తనిఖీకి వస్తుండడంతో ఈ మందులు కనబడితే తమ బండారం బట్టబయలు అవుతుందని భావించి,ఉద్యోగాలు పోతాయని భయంతో గుట్టు చప్పుడు తమ సిబ్బందితో మంటల్లో వేసి కాల్చివేసే చర్యకు పాల్పడినట్లు సమాచారం.