సూర్యాపేట జిల్లా:ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని శాసన సభనుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పెన్ పహాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొంగరి యుగంధర్ అన్నారు.
ప్రజా పరిపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పరిపాలన చేతగాక ప్రజల సమస్యల పట్ల ప్రజా గొంతుకై మాట్లాడుతున్న జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం అనేది అధికార అహంకారమని మండిపడ్డారు.
ఇలాంటి ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారన్నారు.