హీట్ పుట్టిస్తున్న బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం

సూర్యాపేట జిల్లా:సూర్యాపేటలో సూర్యుడి వేడి కంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల దాడి మరింత హీట్ పుట్టుస్తుంది.ఉదయం బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి మంత్రిపై ఆరోపణలు చేస్తే సాయంత్రం అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై భగ్గున మండిపడుతున్నారు.

 Heat-generating Bjp Vs Trs War Of Words-TeluguStop.com

అంతటితో ఆగకుండా తెల్లారి బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి మరికొన్ని కొత్త ఆరోపణలతో రాజకీయ దుమారం రేపుతున్నారు.ఈ పరస్పర మాటల దాడిలో భాగంగా ఆదివారం మళ్ళీ బీజేపీ నేతలు మీడియా ముందుకు వచ్చారు.

పేటలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు బయటపెడితే తట్టుకోలేక టీఆర్ఎస్ నేతలు కారు కూతలు కూస్తున్నారని,తమ నాయకుడు అవినీతిపై మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సంకినేని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్లలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా బయటపెట్టాం అది నిజం కాదా? సూర్యాపేటలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతున్నదనేది వాస్తవం కాదా? ప్రతి కాంట్రాక్టు శ్రీనివాస్ రెడ్డికి అప్పగిస్తే ఒక్క రోడ్డు కూడా నాణ్యత లేకుండా పోయింది ప్రజలకు తెలీదా?44వ వార్డులో రోడ్ ఎంత నాణ్యంగా ఉందో వార్డ్ ప్రజలను అడిగితే తెలియదా? సొంత పార్టీ నాయకులకు టెండర్లు లేకుండా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టులు అప్పగించిన మాట వాస్తవం కాదా? అన్ని కాంట్రాక్టులలో మంత్రికి వాటా వెళుతున్న సంగతి అబద్దమా? బెల్లం సిండికేట్ ఏర్పాటు చేసి, కిరాణా మర్చంట్ అసోసియేషన్ ద్వారా వాళ్ళ దగ్గరే అమ్మేలా టీఆర్ఎస్ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ,టీఆర్ఎస్ టౌన్ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ హుకూం జారీ చేసింది వాస్తవం కాదా? చేసేవన్నీ చేస్తూ దొంగే దొంగా దొంగా అన్నట్లుగా టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఉందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.40ఏండ్లుగా తమ నాయకుడి మోచేతి నీళ్లు తాగిన వ్యక్తులు ఇప్పుడు అధికార దాహంతో పిచ్చికుతలు కూస్తున్నారని మండిపడ్డారు.గంజాయిని ప్రోత్సహిస్తున్న మంత్రి అవినీతిని బయటపెడుతుంటే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని,మంత్రికి దమ్ముంటే అవినీతి ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు.సంకినేని కుమారుడు,అతని స్నేహితులు గంజాయి తాగుతున్నారని పనికి మాలిన విమర్శలు చేసేవారు దమ్ముంటే నిరూపించాలని,ఏ రకమైన టెస్టులకైనా సిద్ధమని టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.

నిన్న ప్రెస్ మీట్ లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన జెడ్పిటిసి జీడీ భిక్షం జోకుడు భిక్షం అనే సంగతి అందరికీ తెలిసిందేనని,తండ్రి పుట్టిల్లు మేనమామకు తెలిసినట్లు మీ బాగోతం అంతా మాకు తెలుసునని ఎదురుదాడి చేశారు.సంకినేని పక్కన కూర్చున్నందుకే నీకు జడ్పీటీసీ పదవి వచ్చిందని తెలుసుకోవాలని హితవు పలికారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యంగం మార్చాలన్నప్పుడు దళితుడుగా నీవు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.రాబోయే రోజుల్లో మీకూ,మీ మంత్రికి బుద్ధి చెప్పేందుకు సూర్యాపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారని,బీజేపీ శ్రేణులకు ఓపిక నశిస్తే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర,సీనియర్ నాయకులు చలమల నరసింహ,జిల్లా కార్యదర్శి సంధ్యాల సైదులు,దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వల్దాస్ ఉపేందర్,మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మీర్ అక్బర్,సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి,పట్టణ నాయకులు ఆరూరి శివ,దాసరి వెంకన్న యాదవ్,సలీం,సూర్యాపేట మండల ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube