గడిచిన రెండు మూడు సంవత్సరాలు కరోనా ప్రభావం ప్రజలపై ఎక్కువగానే పడింది అని చెప్పవచ్చ్చు .అంతేకాదు కరోనా ప్రభావం చలన చిత్ర పరిశ్రమపై కూడా తన ఎఫెక్ట్ చూపెట్టింది.
అందులో భాగంగానే లాస్ట్ రెండు మూడు సవత్సరాలు ఎటువంటి సినిమా షూటింగ్స్ కానీ రిలీజ్ లు కానీ జరగలేదు.ఈ పాండమిక్ నేపథ్యంలో అలస్యమవుతూ వచ్చిన పాన్ ఇండియా చిత్రాలన్నీ వరస పెట్టి ఒక్కొక్కటిగా రిలీజ్ కు సిద్దమయ్యి ఒక్కొక్కటి గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అయితే వాటిలో సౌత్ ఇండియన్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుండగా.వాటి దెబ్బకు హిందీ చిత్రాలు బెంబేలేత్తుతున్నాయని చెప్పవచ్చు.
అయితే గతేడాది డిసెంబర్ లో రిలీజైన ‘పుష్ప: ది రైజ్’ సినిమా నార్త్ లో 100 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.అంతేకాదు అదే సమయంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన ‘83′ సినిమా మాత్రం పరాజయాన్ని పొందింది.
అలాగే అనేక ముఖ్యమైన భారతీయ భాషల్లో విడుదల చేసిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా కూడా అంతగా ప్రభావం చూపలేకపోయింది.అయితే ఇదే క్రమంలో వచ్చిన ‘వాలిమై’ కానీ ‘రాధేశ్యామ్’ , ‘ఈటీ’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు ప్లాప్స్ లిస్ట్ లో చేరాయి.
రీసెంట్ గా మార్చ్ 25 న విడుదలైన RRR మూవీ హిందీ లో ది బెల్ట్ లిస్ట్ లో చేరి 246 కోట్లకు పైగా వసూలు చేసి.250 కోట్ల మార్కుకు అతి దగ్గరలో ఉంది.

అలాగే ఇటీవల విడుదలైన ‘బీస్ట్’ సినిమా నార్త్ లో ఏ మాత్రం రాణించ లేకపోయింది.అయితే ఇప్పుడు లేటెస్టుగా థియేటర్లలో ఎంట్రీ ఇచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.ఫస్ట్ డే లో 53.95 కోట్లు వసూలు చేసిన ‘కేజీయఫ్: చాప్టర్ 2’.శుక్రవారం 46.79 కోట్లు కలెక్ట్ చేసి, రెండు రోజుల్లోనే హిందీలో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.ఇప్పటి వరకు ‘పుష్ప’ ‘RRR’ ‘కేజీఎఫ్ 2’ వంటి సౌత్ సినిమాలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిందని అర్థం అవుతుంది.అయితే రాబోయే కొద్దీ కాలం లో సరైన పాన్ ఇండియా రేంజ్ సినిమాలేవి లేవనే చెప్పాలి.

‘ఆచార్య’ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయనే నివేదికలు వినిపిస్తున్నాయి.మరి ఆచార్య సినిమా పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో చేరుతుందో లేదు చూడాలి.అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ చిత్రాన్ని తెలుగు హిందీ మలయాళ భాషల్లో మే 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అలాగే అమీర్ ఖాన్ – అక్కినేని నాగచైతన్య కలిసి చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 12న రిలీజ్ చేస్తున్నారట.
ఇక సమంత లీడ్ రోల్ లో ఆగష్టు 13న రాబోతున్న ‘యశోద’ సినిమా కూడా బహు భాషా చిత్రమే.అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘ఏజెంట్’ ను పాన్ ఇండియా మూవీగా చేయడానికి మేకర్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారట.
ఇక విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రాబోతోంది.

అంతేకాదు రణబీర్ కపూర్ – అక్కినేని నాగార్జున మరియు అలియా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని పాన్-ఇండియాగా రేంజ్ లో సెప్టెంబర్ 9న సౌత్ లో రాజమౌళి రిలీజ్ చేయబోతున్నా ఈ సినిమా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ 2023 సంక్రాంతికి విడుదల చేయనుండగా, అలాగే సినిమాను ‘సలార్’ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఏడాది సమ్మర్ లో థియేటర్లలోకి వస్తుందట.

సెట్స్ మీదున్న రామ్ చరణ్ RC15 మూవీ,అలగే త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఎన్టీఆర్ NTR30 చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.అంతే కాదు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా తెలుగుతో పాటుగా పలు ఇతర భాషల్లో విడుదల కానుంది.మరి వీటిల్లో ఏవేవి ‘పుష్ప’ ‘RRR’ ‘కేజీఎఫ్ 2’ సినిమాల రేంజ్ లో పాన్ ఇండియా రేంజ్ సత్తా చాటుతాయో వేచి చూడాల్సిందే.







