సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో రాత్రిపగలు తేడా లేకుండా విధిస్తున్న కరెంట్ కోతలతో పట్టణ ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఒకవైపు దోమల స్వైరవిహారం,మరోకవైపు ఉక్కపోత ఏమైందీ పట్టణానికి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని గుడిబండ రోడ్డులో రాత్రి 12 గంటల నుండి కరెంటు పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా విద్యుత్ శాఖా అధికారులు పట్టించుకోవడం లేదని,ఫోన్ చేసినా స్పందించడం లేదని అధికారుల తీరుపై పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.