ఆ ఇద్దరూ రైతులను మోసం చేస్తున్నారు:సంకినేని

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి,సూర్యాపేట ఎమ్మెల్యేలు రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు.సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందన్నారు.సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్,సూర్యాపేట ఎమ్మెల్యే,మంత్రి జగదీశ్ రెడ్డిల బినామీ అయిన ఇమ్మడి సోమనరసయ్యతో కలిసి ధాన్యం,ఇసుక,భూ మాఫియాలకు ఎగబడి వందల కోట్ల ఆస్తులను సంపాదించారని ఆరోపించారు.2014 ఎలక్షన్లకు ముందు వీరి ఆస్తులు ఎంత? ఆ తర్వాత సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి,తుంగతుర్తిలో గాదరి కిషోర్ ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఇప్పుడు వీరికి ఉన్న ఆస్తులు ఎంత?వందల కోట్లకు అధిపతులెట్లా అయ్యారో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వరి వేస్తే ఊరే అని,వరి ధాన్యం కొనమని చెప్పి, రైతులను వరి పంట వేయకుండా చేసి,చివరకు ఎంతో కొంతమంది రైతులు వరి ధాన్యం వేయగా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని,ఇక్కడ ధాన్యం వచ్చే టైంకు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నామని,రైతులను మభ్యపెట్టి,పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధర 1960 రూపాయలు రాకుండా 1400 నుంచి 1700 రూపాయల వరకు రైతుల దగ్గర నుంచి దళారులు కొనడం జరిగిందన్నారు.తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొంటుందని చెప్పి రైతులను మోసం చేసి, ఈరోజు తక్కువ ధరకు రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యాన్ని మద్దతు ధర 1960 రూపాయలకు బినామీల పేరుతో ప్రభుత్వానికి అమ్మినట్లుగా చూపి రైతులను మోసం చేసినట్లు చెప్పారు.

 Those Two Are Cheating The Farmers: Sankineni-TeluguStop.com

ఇదంతా రైతులను మోసం చేయుటకు కేసీఆర్ ప్రభుత్వం ఆడిన డ్రామాగా ఉందని,రైతులపై నిజమైన ప్రేమ ఉంటే తక్కువ ధరకు అమ్మిన రైతులకు మద్దతు ధర వచ్చేలా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి,ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి వచ్చిన డబ్బుల ద్వారా అనేక అక్రమ అవినీతి వ్యాపారాలు నిర్వహించి, వందల కోట్ల రూపాయలు సంపాదించారని, ఆరోపించారు.

ధాన్యం మాఫియాతో సంపాదించిన డబ్బులు చాలవని ఇసుక దందా మొదలెట్టి, తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తాటిపాముల, అనంతారం,జానకిపురం,శాలిగౌరారం,జాజిరెడ్డిగూడెం, పేరబోయినగూడెం,వర్ధమానుకోట,గ్రామాల పక్కనే ఉన్న బిక్కేరు వాగు మొత్తం ఖాళీ చేసి,వందల కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని, నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube