కోదాడ పట్టణంలో ఫాగింగ్‌ లేక విస్తరిస్తున్న విష జ్వరాలు

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మునిసిపల్‌ యంత్రాంగం సీత కన్నేసిందా అంటే అవుననే అంటున్నారు పట్టణ ప్రజలు.పట్టణంలో పారిశుద్ద్యం పడకేసి దోమల బెడద ఎక్కువై ప్రజలు విషజ్వరాల బారిన పడడడమే దీనికి నిదర్శనం అంటున్నారు.

 Fogging Or Spreading Poisonous Fevers In Kodada Town , Poisonous Fevers, Kodad-TeluguStop.com

ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ప్రజల రక్త పరీక్షల్లో మలేరియా, టైఫాయిడ్‌ ( Typhoid , Malaria )లక్షణాలే ఎక్కువగా కనిపించడంతో పట్టణ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.కొద్ది రోజులుగా కోదాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది జ్వర పీడితులే ఉండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో జ్వరాల( Fevers ) బారిన పడిన వారంతా శారీరకంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు.దోమలతో అవస్థలు పడలేక పట్టణ వాసులు కాయిల్స్‌ను, లిక్విడ్ లను,దోమల స్టిక్స్ ను వినియోగిస్తున్నామని వాపోతున్నారు.

పట్టణంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయక చాలా కాలమైందని, కారణం ఏమిటని అడిగితే పాగింగ్ మిషన్లు పని చేయడం లేదని చెబుతున్నారని,మిషన్ల రిపేర్ కే డబ్బులు లేకపోతే కోట్ల రూపాయల మున్సిపల్ బడ్జెట్ ఏమౌతుందని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా మునిసిపల్ అధికార యంత్రాంగం చొరవ చూపి కోదాడ( Kodad ) పట్టణ వాసులను దోమల బారి నుండి కాపాడి ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube