సూర్యాపేట జిల్లా:శ్రీ బసవేశ్వర్ మహరాజ్ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముందుగా శ్రీ బసవేశ్వర్ మహరాజ్ చిత్రపటానికి పూల వేసి ఘనం నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలోని కుల వ్యవస్థతో పాటు వర్ణ భేదాలు,లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాదయిన శ్రీ బసవేశ్వర మహరాజ్ మనందరికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నివాళులు అర్పించిన వారిలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్ఐలు శ్రీనివాస్,గోవిందరావు,ఆర్ఎస్ఐ సాయి,ఏఆర్ఎస్ఐలు,సీసీ సందీప్,సిబ్బంది పాల్గొన్నారు.