Mellacheruvu Maha Jatara : మేళ్లచెరువు మహా జాతరకు సర్వం సిద్దం…!

మేళ్లచెరువు మండల కేంద్రంలోని వెలసిన స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి జాతరకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.నేటి నుంచి ఐదు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.

 Everything Is Ready For The Mellacheruvu Maha Jatara-TeluguStop.com

బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ,పోలీసులు, అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేసింది.డ్రోన్ల ద్వారా జాతర ప్రదేశాన్ని నిత్యం పరిశీలించనున్నారు.

మేళ్లచెరువు జాతర( Mellacheruvu Maha Jatara ) అంటే ఎడ్ల పందాలకు పెట్టింది పేరు‌‌‌‌‌‌‌.ఎడ్ల పందాలు,బండ లాగుడు పోటీలకు తెలంగాణ,ఏపీ నుంచి లక్షలాది మంది తరలివస్తారు.

భారీ లైటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రభలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.నేడు అంకురార్పణతో మొదలై అభిషేకాలు,మహాన్యాసకపూర్వ రుద్రాభిషేకం‌( Rudrabhishekam )తో కుంకుమార్చనలు,రథోత్సవం, నిత్య పూజలతో చివరి రోజు పూర్ణాహుతి పవళింపు సేవ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.

మేళ్ళచెర్వు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి జాతరకు( Shambhu Lingeswara Swamy ) జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేసింది శాఖల వారీగా నిర్దేశించిన పనులను పూర్తి చేసింది.వాహనాల పార్కింగ్,ఆలయ ప్రాంగణంలో బారికేడ్ల ఏర్పాటు,గుడి ప్రాంగణంలో లైటింగ్‌,ఆలయం చుట్టూ చదును చేసి ప్రభల ఏర్పాట్లకు సిద్దం చేశారు.

భక్తులకు సౌకర్యార్థం అన్ని రూట్లో బస్సులను నడపనున్నారు.శానిటేషన్,భక్తులకు త్రాగునీరు ఏర్పాట్లు పరిశీలించేందుకు డిఎల్‌పిఓ, ఎంపీడీవోలు,తాహశీల్దార్‌లకు సూచించిన విధంగా విధులు నిర్వహిస్తారు.

తాత్కాలిక టాయిలెట్స్‌ నిర్మాణం, మహిళల కొరకు ప్రత్యేకంగా షీటాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు.దేవాలయం చుట్టుపక్కల నిరంతర కరెంటు ఉండేటట్లుగా విద్యుత్‌ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

భక్తుల సేవల కొరకు ఎన్జీవోలను,ఎన్‌సీసీ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube