సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు (భరోసా)పథకంపై రైతుల అభిప్రాయాలు సేకరించడానికి సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని నిసిరికొండ, సర్వారం సహకార సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ప్రాథమిక సహకార సంఘాల డిసిఓ పద్మ హాజరై రైతు భరోసా పథకం ఎంత భూమి ఉన్నవారికి ఇవ్వాలి?ఎకరానికి ఎంతివ్వాలి? అని రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ఎక్కువ మంది రైతులు 10ఎకరాల లోపు వారికి ఇవ్వాలని, గుట్టలు,వెంచర్లు,సాగు చేయని భూమికి ఇవ్వొద్దన్నారని డిసిఓ తెలిపారు.సింగిల్ విండో బ్యాంక్ ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామని,రైతులకు వరి విత్తనలు అందుబాటులో ఉంచామని,త్వరలో మీ సేవ ద్వారా అన్ని రకాల సేవలు కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిరికొండ ప్యాక్స్ చైర్మన్ వెంకట్ రెడ్డి,డిసిఎల్పీ కృష్ణ,కిసాన్ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి, ఏఓ అరుణ,రెండు బ్యాంకుల సీఈవోలు వెంకట్ రెడ్డి, ఉపేందర్,ఏఈఓలు కార్తిక్, మౌనిక,ప్రియాంక,డైరెక్టర్లు పల్స్ మల్సూర్,బొడుపుల పుల్లయ్య,బ్యాంకుల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.