కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంది: రెడ్డిపల్లి శ్రీనయ్య

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాలకవీడు మండల శాఖ అధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీనయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు పిఆర్సీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు.

 Have Faith In Congress Government Reddypalli Sreenaiah, Congress Government, Red-TeluguStop.com

కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని,ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహ అవసరాలతో పాటు ప్రభుత్వ పాఠశాలకు కూడా వర్తింప చేయాలన్నారు.

గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,ప్రతి పాఠశాలకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని,పెండింగ్ లో ఉన్న మధ్యాహ్నం భోజన బిల్లులు చెల్లించి, కార్మికులకు వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube