సూర్యాపేట జిల్లా: శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిఘాను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక సాధారణ, పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా అన్నారు.బుధవారం కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.
వెంకట్రావ్, సాధారణ కౌశిగన్, బాలకిషన్ ముండా అదనపు కలెక్టర్ ప్రియాంక లతో కలసి మీడియా సెంటర్,బ్యాంక్ లావాదేవీల కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ లను ఈ సందర్బంగా ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి అంశం ఉండేలా చూడాలన్నారు.
దినపత్రికలు,చానల్ లో వచ్చే పెయిడ్ న్యూస్, పెయిడ్ ఆర్టికల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని అలాగే గుర్తించిన వార్తలకు తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో జరిగే బ్యాంక్, డిజిటల్ లావాదేవీలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు.
సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు,వార్తలపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదిశగా కట్టడి చేయాలని అన్నారు.అనంతరం కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ మాట్లాడుతూ శాటిలైట్ చానల్స్, స్థానికంగా వచ్చే కేబుల్స్ చానల్స్ లో వచ్చే ప్రసారాలను అన్నింటిని రికార్డింగ్ జరుగుతుందని అదేవిదంగా పెయిడ్ న్యూస్,పెయిడ్ ఆర్టికల్స్ ను క్షుణ్ణoగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటున్నామని అలాగే ఎంసిఎంసి నుండి అనుమతులను కూడా ఇస్తున్నామని అలాగే అందిన ఫిర్యాదులను పరిశీలన చేసి పరిష్కరిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ రమేష్ కుమార్,డిఈ మల్లేశం, ఎల్.
డి.ఎం బాపూజీ,ఈడిఎం గఫ్ఫార్, ఎంసిఎంసి కమిటీ సభ్యులు,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.