1.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.పవన్ పై తులసిరెడ్డి కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు.
3.టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ను సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు.
4.నక్సలైట్ల సమావేశం
తెలంగాణలో మళ్లీ నక్సలైట్ల కదలికలు ప్రారంభం అయ్యాయి.జనశక్తి సెక్రెటరీ విశ్వనాథం ఆధ్వర్యంలో సిరిసిల్ల సరిహద్దుల్లోని పోతినేపల్లి ఫారెస్ట్ లో 80 మంది నక్సలైట్ లు సమావేశం అయ్యారు.
5.యదాద్రిలో పంచకుండత్మక యాగం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బలాలయంలో పంచకుండాత్మక యాగం ప్రారంభం అయింది.ఈ రోజు నుంచి ఏడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.
6.టీఆర్ఎస్ భవన్ వద్ద మీడియా పై ఆంక్షలు
తెలంగాణ భవన్ లోకి మీడియాను అనుమతించేందుకు తెలంగాణ భవన్ అధికారులు నిరాకరించారు.
7.బోధన్ లో కొనసాగుతున్న బంద్
బీజేపీ, శివ సేన , హిందూ వాహిని పిలుపు మేరకు బోధన్ లో బంద్ కొనసాగుతోంది.
8.మూడో టిఎంసి పనులు అపండి
కాళేశ్వరం మూడో టిఎంసి విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు అయ్యింది.
9.ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తాం
దేశంలో ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
10.కెటిఆర్ కు ఎన్నైరైల ఘన స్వాగతం
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది.తెలంగాణ లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లారు.
11.పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ గా కుల్తార్ సింగ్
పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ గా కుల్తార్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
12.స్పీకర్ కు టిడిపి ఎమ్మెల్యే ల లేఖ
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు టిడిపి ఎమ్మెల్యే లు లేఖ రాశారు.పెగాసేస్ వ్యవహారాన్ని సభలో చర్చించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.
13.జగన్ చిత్రపటానికి మధ్యభిషేకం
ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.దీనిలో భాగంగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభ పక్షం ఆధ్వర్యంలో జగన్ ఫోటో కు మద్యం తో అభిషేకం నిర్వహించారు.
14.నేడు కీలక బిల్లుల కు ఏపీ అసెంబ్లీ లో ఆమోదం
నేడు ఏపీ అసెంబ్లీ లో కీలక బిల్లులను ఆమోదించనున్నారు.
15.జగన్ తో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల భేటీ
నేడు ఏపీ సీఎం జగన్ తో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల బృందం భేటీ అయ్యారు.
16.తెలంగాణ బిజెపి నేతలతో తరుణ్ చుగ్
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ జిల్లాల వారీగా నేడు రేపు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
17.ఢిల్లీ కి కేసీఆర్ బృందం
తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది.
18.మూడు రోజుల పాటు వర్షాలు
నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ ఆంధ్రా లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
19.బండి సంజయ్ కామెంట్స్
తెలంగాణలో బిజెపిది డబుల్ ఇంజన్ అని , వారిది ట్రబుల్ ఇంజన్ అని టీఆర్ఎస్ ను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,700
.