కేంద్ర ప్రభుత్వం బీసీల వాటా ఇవ్వకపోతే పార్లమెంట్ ముట్టడి చేస్తాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకుందామని బిసి ఉద్యమం ద్వారా బీసీ హక్కులను సాధించుకుంటామని కేంద్ర ప్రభుత్వం బీసీలకు సరైన వాటా కల్పించకపోతే మరో దశ తెలంగాణ ఉద్యమం చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు సోమవారం కాచిగూడ అభినందన హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .
ఈనెల 23వ తేదీన ఢిల్లీలో బీసీ ఉద్యోగుల తో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం దిగిరాకపోతే పార్లమెంట్ ముట్టడి చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు బీసీ కులాల ని ఏకమై మిలిటెంట్ పోరాటాలు చేయడానికి ముందుకు రాకపోతే బానిస బతుకులు మారవు అని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బీసీ రాష్ట్ర యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యుగేందర్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , నీల వెంకటేశం మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
.