ఐక్యరాజ్యసమితి అత్యున్నత సలహా మండలిలో భారతీయురాలికి చోటు..!!

ఐక్యరాజ్యసమితిలో భారతీయ మహిళా ఆర్ధికవేత్తకు కీలక పదవి దక్కింది.effective multilateralismపై అత్యున్నత స్థాయి సలహా మండలిలో భారతీయ అర్ధికవేత్త జయతీ ఘోష్‌ను నియమిస్తూ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ ఆదేశాలు జారీ చేశారు.66 ఏళ్ల ఘోష్.మసాచుసెట్స్ అమ్హెర్ట్స్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

 Indian Economist Jayati Ghosh Named By Un To High-level Advisory Board On Multil-TeluguStop.com

ఆమె గతంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో … ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గానూ, ఛైర్‌పర్సన్‌గానూ విధులు నిర్వర్తించారు.అంతేకాదు ఆర్ధిక, సామాజిక వ్యవహారాలపై యూఎన్ ఉన్నత స్థాయి సలహా మండలిలో కూడా జయతీ ఘోష్ సభ్యురాలు.

లైబీరియా మాజీ ప్రెసిడెంట్, నోబెల్ గ్రహీత ఎల్లెన్ జాన్సన్ సిర్లీఫ్, స్వీడిష్ మాజీ ప్రధాని స్టీఫన్ లోఫ్వెన్‌‌లు కో చైర్‌గా ఎఫెక్టివ్ మల్టీ లాటరలిజమ్‌పై అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ శుక్రవారం ప్రకటించారు.సెక్రటరీ జనరల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్‌తో సన్నిహిత సంబంధాలు, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ద్వారా 12 మంది సభ్యులున్న ఈ అత్యున్నత సలహా బోర్డులో జయతీ ఘోష్ స్థానం సంపాదించుకున్నారు.

కోవిడ్ అనంతరం ప్రస్తుత, భవిష్యత్తులో సామాజిక , ఆర్ధిక సవాళ్లకు ప్రతిస్పందనపై సిఫార్సులను అందించేందుకు గాను గత ఏడాది జనవరిలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సలహా మండలిలోనూ జయతికి గుటెర్రెస్ స్థానం కల్పించారు.

Telugu Policy Research, Indianeconomist, Jayati Ghosh, Nobellaureate, Unsecretar

1955లో జన్మించిన జయతీ ఘోష్.ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నారు.

అనంతరం పీహెచ్‌డీ కోసం కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఇన్‌లాక్స్ స్కాలర్‌షిప్‌ను పొందారు జయతీ.“Non capitalist land rent: theories and the case of North India” అనే అంశంపై జయతీ ఘోష్ రీసెర్చ్ చేశారు.ఆమె భర్త ప్రముఖ ఆర్ధిక వేత్త అభిజిత్ సేన్.

ఈయన గతంలో ప్రణాళికా సంఘంలో సభ్యునిగా వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube