పవిత్రమైన కార్తిక పౌర్ణమిని.. పంచాంగం ప్రకారం ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలో( Karthika Masam ) వచ్చే పౌర్ణమిని ఎంతో పవిత్రమైన రోజుగా ప్రజలు భావిస్తారు.ఈ రోజున నది స్నానాలు చేసి దానం చేస్తే ఎన్నో పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

 Kartika Purnima 2023 Date Shubh Muhurat Puja Time And Significance Details, Kart-TeluguStop.com

అలాగే భక్తుల కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతున్నారు.పరమశివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అనే దాదాపు చాలామందికి తెలుసు.

ప్రతి సంవత్సరం దీపావళి తర్వాతి రోజు నుంచి ఈ పవిత్రమైన మాసం మొదలవుతుంది.ఈ మాసంలో భక్తకోటి కఠిన నిష్టతో చేపట్టే వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

అందుకే ఈ మాసంలో వచ్చే ప్రతి రోజు ఎంతో పవిత్రమైన రోజుగా చెప్పవచ్చు.అందులోనూ కార్తిక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

శివ విష్ణువులిద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ అని కూడా అంటారు.

Telugu Bhakti, Devotional, Kartika Purnima, Kartikapurnima, Parameshwara, Puja,

కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది.వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది కూడా ఈ పూర్ణిమ రోజే అనే పండితులు చెబుతున్నారు.ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున భక్తులు ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం( River Bath ) చేసి, దానధర్మాలు చేస్తారు.

ఈ విధంగా చేస్తే ఈ మాసం మొత్తం భగవంతున్నీ పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఈ సంవత్సరం అధికమాసం కారణంగా పండుగ తిధులన్నీ రెండు రోజుల్లో విస్తరించి ఉంటున్న సంగతి దాదాపు చాలామందికి తెలుసు.

Telugu Bhakti, Devotional, Kartika Purnima, Kartikapurnima, Parameshwara, Puja,

ఇదే విధంగా కార్తీక పౌర్ణమి కూడా రెండు రోజుల్లో వచ్చింది.నవంబర్ 26, 27వ తేదీలలో ఈ పౌర్ణమి ఘడియలు ఉన్నాయి.దీంతో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి పండుగను ఏ రోజు నిర్వహించుకోవాలి అనే సందిగ్ధంలో భక్తులు ఉన్నారు.పంచాంగం( Panchangam ) ప్రకారం పౌర్ణమి తిధి నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల 53 నిమిషములకు మొదలవుతుంది.

నవంబర్ 27వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషములకు ముగుస్తుంది.అయితే కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పని దీపం వెలిగించడం అని పండితులు చెబుతున్నారు.

అలాగే దీపం వెలిగిస్తున్నప్పుడు పౌర్ణమి ఘడియలతోపాటు కృత్తిక నక్షత్రం కూడా ఉండాలి.ఈ విధంగా అయితే 26వ తేదీన మాత్రమే ఈ ఘడియలు ఉన్నాయి.అందువల్ల ఈ రోజునే కార్తీక పౌర్ణమినీ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube