ఏపీకి కొత్త అధ్య‌క్షుడి కోసం ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్‌.. ఎవ‌రున్నా ఏం లాభం..?

ఇప్పుడు ఏపీలో వైసీపీ పార్టీ ముందు ఎంతో చ‌రిత్ర ఉన్న టీడీపీనే నిల‌దొక్కుకోలేక‌పోతోంది.అలాంటిది ఏపీ న‌ష్ట‌పోవ‌డానికి కార‌ణ‌మైన కాంగ్రెస్ ప‌రిస్థితి ఇంకెలా ఉంటుంది.

 Congress Is Trying For A New President For Ap .. What Is The Benefit To Anyone .-TeluguStop.com

అందుకే ఆ పార్టీకి పుట్ట‌గ‌తులు లేకుండా పోయింది.ఆ పార్టీని జ‌నాలు పాతాలానికి తొక్కేశారు.

అయితే ఇప్పుడు ఆ పార్టీని పూర్వ వైభ‌వంలోకి తీసుకురావాల‌ని అనుకుంటున్నారంట‌.ఇందుకోసం ఇప్పుడు దీపావళి పండుగ తర్వాత ఆ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియ‌మిస్తార‌ని తెలుస్తోంది.

ఇప్పుడున్న సాకే శైలజానాథ్ పనితీరు పార్టీని న‌డిపించ‌ట్లేద‌ని చెబుతున్నారంట‌.

ఇక ఈ విష‌యాల‌ను కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ వెల్ల‌డించ‌డం ఇప్పుడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

అయితే ఇక్క‌డ ఆయ‌న అధ్య‌క్షుడిని మార్చాల‌ని చెప్పారు కానీ శైలజానాథ్‌ పని తీరు బాగోలేదని డైరెక్టుగా ఒప్పుకోలేద‌న్న‌మాట‌.కాగా పార్టీని ముందుకు న‌డిపించాలంటే దీపావళి తర్వాత క‌చ్చితంగా కొత్త అధ్యక్షుడిని తీసుకురావాల‌ని మాత్రం ఆయ‌న చెప్తున్నారంట.

లేదంటే మాత్రం పార్టీకి ఇబ్బందుల‌ని ఆలోచిస్తున్నారంట‌.ఇక ఢిల్లీ అధిష్టానం కూడా ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల‌ని అనుకుంటోందంట‌.

Telugu Ap Congress, Ap, Ap Poltics, Chinta Mohan, Congress, Rahul Gandhi, Sonia

కాగా అస‌లు ఏపీలో ఉనికిలో కూడా లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త‌గా అధ్యక్షుడు వ‌స్తే మాత్రం ఏం ఉప‌యోగం అని అస‌లు ఆ పార్టీకి ఒరిగేదేమీ లేద‌ని చెబుతున్నారు.ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్‌ను మెజారిటీ జనాలు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ట్లేదు.అస‌లు రాష్ట్రాన్ని రెండుగా చీల్చవద్దని ఆంధ్రాలోని 13 జిల్లాలు ముక్త కంఠంతో నినదించినా కూడా సోనియా చేసిన విభ‌జ‌న వ‌ల్ల మెజారిటి జనాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.అప్ప‌టి నుంచే కాంగ్రెస్‌ను పెద్ద గొయ్యి తవ్వి కప్పెట్టేశార‌నే చెప్పాలి.

మ‌రి ఇప్ప‌టికీ ఈ పార్టీపై తీవ్ర‌మైన వ్య‌తిరేకత ఉన్నందున ఎవ‌రు ఉంటే ఏంట‌ని నిపుణులు చెబుతున్నారు.మ‌రి ఢిల్లీ అధిష్టానం ఎవ‌రిని నియ‌మిస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube