సుమ షోకి వచ్చిన సిరి ప్రియుడు శ్రీహాన్... వారి ఇద్దరికి ఫ్లెమ్స్ చేసి ఆమె ఏం చెప్పిందంటే?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎక్కడ ఉంటే సందడి మొత్తం అక్కడే ఉంటుంది.

 Siri Boyfriend Srihan Came To Suma Show Flames The Two Of Them And What Did She-TeluguStop.com

ఇకపోతే బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ లో మనకి కనపడుతుంది అంటే అతిశయోక్తి కాదు.ఇలా ప్రతి ఛానల్ లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా సుమ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.

ఇకపోతే సుమ వ్యాఖ్యాతగా స్టార్ మాలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం స్టార్ట్ మ్యూజిక్ అనే కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

ఇకపోతే ఈ వారం ఈ కార్యక్రమానికి పలువురు యూట్యూబ్ స్టార్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి ప్రియుడు శ్రీహాన్ వచ్చినట్లు తెలుస్తోంది.శ్రీహాన్ కూడా పలు వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

మరీ ముఖ్యంగా సిరి బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత శ్రీహాన్ కి మరింత పాపులారిటీ దక్కిందని చెప్పవచ్చు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వీరందరి పై తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్వించారు.

Telugu Boyfriend, Marrige, Shanmukh, Siri, Srihan, Music, Suma Show-Movie

ఇక ఈ ప్రోమోలో భాగంగా అక్కడికి వచ్చిన సెలబ్రెటీలతో ఈమె ఫ్లెమ్స్ చేసి వారికి ఏం వచ్చిందో తెలిపారు.ఈ క్రమంలోనే శ్రీహాన్, సిరి లవర్స్ అని వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సిరి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడం అక్కడ షణ్ముఖ్ జస్వంత్ తో ఈమె క్లోజ్ గా మూవ్ అవ్వడం, బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన విడిపోవడం, వీరు విడిపోవడానికి కారణం సిరి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే సిరి, శ్రీహాన్ కూడా విడిపోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సుమ ఈ కార్యక్రమంలో భాగంగా సిరి, శ్రీహాన్ ఇద్దరికీ ఫ్లెమ్స్ చేసి చూశారు.

Telugu Boyfriend, Marrige, Shanmukh, Siri, Srihan, Music, Suma Show-Movie

ఇలా సిరి, శ్రీహాన్ ఇద్దరికీ ఫ్లెమ్స్ చూడగా వీరిద్దరికీ మ్యారేజ్ అని రావడం అందరిని ఎంతో సంతోషానికి గురి చేసింది.బిగ్ బాస్ కార్యక్రమం వల్ల ఈ జంట కూడా విడిపోతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టార్ట్ మ్యూజిక్ కార్యక్రమం ద్వారా సిరి, శ్రీహాన్ మధ్య మ్యారేజ్ అనే బాండ్ రావడం వీరి అభిమానులకు కాస్త ఊరటగా ఉందని చెప్పవచ్చు.మామూలుగా ఏ కార్యక్రమాలకు హాజరు కాని శ్రీహాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇలా ఈ కార్యక్రమానికి రావడంతో శ్రీహాన్ బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా వెళ్లనున్నారని తెలుస్తుంది.ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి ఆహ్వానించే ముందు వీరందరిని స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలకు ఆహ్వానించడం జరుగుతుంది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీహాన్ పాల్గొంటున్నారు అనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube