ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగబాబు( Nagababu ) అల్లు అర్జున్( Allu Arjun ) పేరు కూడా ఒకటి.ఎన్నికల ప్రచారం సమయం నుంచి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ట్విట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.దీంతో ఈ విషయం గురించి చర్చించుకుంటుండగా తాజాగా సోషల్ మీడియా చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది.
ఇంతకీ ఆ ట్వీట్ ఏది? ఎవరు ఆ ట్వీట్ చేశారు? ఆ ట్వీట్ లో ఏముంది అన్న విషయానికొస్తే.తాజాగా అల్లు అర్జున్ పేరుతో చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఆ ట్వీట్ కనిపించడం లేదు.కాని అల్లు తన ట్విట్టర్ నుంచి నాగబాబుని అన్నమాట వింటే మెగా ఫాన్స్( Mega Fans ) అల్లు అర్జున్ పై ఒక రేంజ్ లో విడుచుకుపడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.అల్లు అర్జున్ ట్విట్టర్ లో అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనే వాడు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ఎదురు సైకిల్ షాపులో పనిచేసుకునే వాడు అంటూ ట్వీట్ చేసినట్టుగా ఒక ప్రింట్ స్క్రీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గత వారం రోజులుగా అల్లు అర్జున్ పై జన సైనికులు, మెగా అభినులు గుర్రుగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ని ( Pawan Kalyan ) వదిలేసి మిత్రుడికి అది కూడా పగ పార్టీకి సపోర్ట్ చేస్తావా అంటూ అల్లు అర్జున్ ని ఆడుకుంటుంటే, నాగబాబు తన సోషల్ మీడియాలో మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే! అని ట్వీట్ చేసింది అల్లు అర్జున్ ని ఉద్దేశించే అంటుంటే.ఇలాంటి సమయంలో సడన్ గా అల్లు అర్జున్ ట్విటర్ లో ఇలాంటి పోస్ట్ కనిపించడం, అది ఇప్పుడు కనిపించకపోవడమనేది చాలామందిని అయోమయానికి గురి చేస్తోంది.







