పనీర్ తెగ తినేస్తున్నారా.. పామాయిల్, సున్నంతో తయారు చేస్తారని తెలిస్తే..!!

చాలామంది పనీర్‌తో తయారు చేసిన వంటకాలు తినడానికి ఇష్టపడుతుంటారు.అయితే వాటిని కూడా కల్తీ చేసే ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.సాధారణంగా 200 గ్రాముల అమృల్ మలాయ్ పనీర్(Amul Malai Paneer) ధర బిగ్ బాస్కెట్‌లో రూ.77.5, బ్లింకిట్‌లో రూ.91 ఉంటుంది.200 గ్రాముల మదర్ డెయిరీ పనీర్ రూ.91కి అమ్ముతారు.అయితే వీధి వ్యాపారులు 300 గ్రాముల పనీర్‌ను రూ.30 నుంచి రూ.50 వరకు అమ్ముతారు.వీధి వ్యాపారులు ఎలా అంత తక్కువ ధరకు పనీర్(paneer) అమ్ముతారు? అనే కదా మీ ప్రశ్న, దానికి సమాధానం వారు నకిలీ పనీర్ తయారు చేయడమే అని చెప్పవచ్చు.

 Do You Eat Paneer.. If You Know It Is Made With Palm Oil And Lime..!!, Paneer, F-TeluguStop.com

ఓ వైరల్ వీడియో పుణ్యమా అని వీధి వంటకాల్లో నకిలీ పనీర్ వాడకం గురించి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.ఈ వీడియోలో లక్ష్మ్య యాదవ్ (Laxmya Yadav)అనే యువకుడు, తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘మల్టిప్లై’(multiply)లో తన భాగస్వామి చేతన్ యాదవ్‌తో కలిసి ఆసక్తికరమైన కంటెంట్‌ను పంచుకుంటూ ఉంటాడు.వీడియోలో లక్ష్మ్య, మన వీధి వంటకాల్లో తరచుగా వాడే ‘నకిలీ’ పనీర్ (fake paneer) గురించి వివరిస్తాడు.ఒక మైక్రోఫోన్ ముందు కూర్చుని, అతను ఈ మోసపూరిత పనీర్‌ను విశ్లేషిస్తాడు.

ఈ వీడియోలో కొన్ని న్యూస్ క్లిప్‌లు, బ్లాగర్ల ఫుటేజ్ కూడా ఉన్నాయి.తద్వారా ఈ నకిలీ పనీర్ ఎలా తయారు చేస్తారో తెలియజేశాడు.దీని తయారీకి పాలు పొడి, పామ్ ఆయిల్, సున్నం వాడతారని వీడియోలో వివరించాడు.లక్ష్మ్య యాదవ్ వీడియోలో “వీధి వ్యాపారుల దగ్గర తింటున్న పనీర్.నిజమైన పనీర్ కాదు, అది కేవలం నూనె మిశ్రమం” అని కచ్చితంగా చెబుతున్నాడు.ఈ నకిలీ పనీర్‌ని వీధి వ్యాపారులే కాకుండా, ఉన్నత రెస్టారెంట్లకు కూడా సరఫరా చేస్తున్నారట.

ఈ నకిలీ పనీర్ రుచి అసలైన పనీర్‌లా ఉంటుంది కాబట్టి, ఎంతటి అనుభవజ్ఞులైన వంటల ప్రియులనైనా మోసం చేయగలదు.

ఈ వీడియోకు 2.17 కోట్లకు పైగా వ్యూస్, 3.86 లక్షల లైకులు, అనేక కామెంట్‌లు వచ్చాయి.ఆందోళన చెందిన నెటిజన్లు, ఈ ఫేక్ పనీర్ తయారీదారులపై ఫుడ్‌ ‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube