హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నాలుగో అనుమానితుడు

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు( Hardeep Singh Nijjar )కు సంబంధించి ఇటీవల అదుపులోకి తీసుకున్న నాలుగో అనుమానితుడిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.ఇతనిని గ్రేటర్ టొరంటో ఏరియా (జీటీఏ)లోని హోల్డింగ్ ఫెసిలిటీ నుంచి బ్రిటీష్ కొలంబియాలోని ప్రావిన్షియల్ కోర్టు ముందు హాజరుపరిచారు.

 Fourth Accused In The Killing Of Hardeep Singh Nijjar Appears In Canadian Court-TeluguStop.com

అమన్‌దీప్ సింగ్ అనే 22 ఏళ్ల భారత జాతీయుడిని మార్చి 11న అరెస్ట్ చేశారు.బ్రాంప్టన్‌ అబాట్స్‌ఫోర్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న అతనిపై ఫస్ట్ డిగ్రీ హత్య, హత్యకు కుట్రపన్నినట్లుగా అభియోగాలు మోపారు.

ఇప్పటికే నిజ్జర్ హత్య కేసులో కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌లను అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్‌ సిటీలో అరెస్ట్ చేశారు.ఆర్‌సీఎంపీ (సర్రే)కి చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) , ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ సాయంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Telugu Amandeep Singh, Brampton, Canadian, Fourth, Hardeepsingh, Karan Brar, Jai

కెనడియన్ మీడియా నివేదికల ప్రకారం అమన్‌దీప్ విచారణకు అంగీకరించాడు.గతంలో అరెస్ట్ అయిన ముగ్గురితో కలిసి మే 21న కోర్టులో హాజరుకానున్నాడు.అయితే ఈ కేసుతో సంబంధం లేని తుపాకీ కలిగివున్నట్లుగా నమోదైన అభియోగాలపై ఇప్పటికే అమన్‌దీప్( Amandeep Singh ) .పీల్ రీజినల్ పోలీస్ కస్టడీలో వున్నట్లుగా తెలుస్తోంది.ఇంతకుముందు అరెస్ట్ అయిన ముగ్గురిని మే 7న కోర్టు ఎదుట హాజరుపరిచినప్పుడు జరిగినట్లుగానే .ఖలిస్తాన్ అనుకూల నిరసనకారుల బృందం వేర్పాటువాద, భారత వ్యతిరేక జెండాలు ప్రదర్శిస్తూ కోర్టు ఎదుట పెద్దసంఖ్యలో గుమిగూడారు.

Telugu Amandeep Singh, Brampton, Canadian, Fourth, Hardeepsingh, Karan Brar, Jai

మరోవైపు .నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడాలో జరుగుతున్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( S Jaishankar ) స్పందించారు.ఖలిస్తానీ వేర్పాటువాద అంశాలకు పొలిటికల్ స్పేస్ ఇవ్వడం ద్వారా కెనడా ప్రభుత్వం తమ ఓటు బ్యాంక్.చట్టబద్ధమైన పాలన కంటే శక్తివంతమైనదనే సందేశాన్ని పంపుతోందన్నారు.జాతీయ వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ.భారతదేశం వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుంది, ఆచరిస్తుందన్నారు.

అయితే అది విదేశీ దౌత్యవేత్తలను బెదిరించే స్వేచ్ఛతో సమానం కాదని.వేర్పాటువాదానికి, హింసను సమర్ధించే అంశాలకు పొలిటికల్ స్పేస్‌ను అనుమతించదన్నారు.

పంజాబ్ నుంచి వలస వెళ్లిన సిక్కులలో ఖలిస్తానీ మద్ధతుదారులను ప్రస్తావిస్తూ.అనుమానాస్పద నేపథ్యాలు కలిగిన వ్యక్తులు కెనడాలో ప్రవేశించడానికి , నివసించడానికి ఎలా అనుమతిస్తున్నారని జైశంకర్ ప్రశ్నించారు.

నియమబద్ధంగా నడిచే సమాజంలో వ్యక్తుల నేపథ్యం, వారు ఎలా ప్రవేశించారు, ఏ పాస్‌పోర్టులను తీసుకెళ్లారు తదితర అంశాలను తనిఖీ చేస్తారని మంత్రి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube