టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరనే చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది.చాలామంది అభిమానులు తమ ఫేవరెట్ హీరోనే నంబర్ వన్ హీరో అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.
అయితే ఆర్మాక్స్ సర్వే ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు సర్వే చేస్తున్నా ఫలితాలు మాత్రం ప్రభాస్ కే పాజిటివ్ గా వస్తున్నాయి.ప్రభాస్ తరచూ నంబర్ వన్ స్థానంలో నిలుస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉండగా ఆయన రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.ప్రభాస్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రభాస్ కు ఇదే విధంగా ఎన్నో అరుదైన రికార్డులు దక్కాలని ఆకాంక్షిస్తున్న ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారనే సంగతి తెలిసిందే.ప్రభాస్ తర్వాత స్థానం స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్కింది.
మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి కాంబినేషన్ గురించి తరచూ వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ జాబితాలో మూడో స్థానం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దక్కింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుని నెట్టింట హాట్ టాపిక్ కావడం గమనార్హం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఈ జాబితాలో ఐదో స్థానం దక్కింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమలేవీ ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ కాకపోయినా ఆయన ఆరో స్థానంలో నిలిచారు.న్యాచురల్ స్టార్ నానికి ఆర్మాక్స్ సర్వే జాబితాలో ఏడో స్థానం దక్కింది.
మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా ఈ లిస్ట్ లో ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )కి తొమ్మిదో స్థానం దక్కగా విజయ్ దేవరకొండకు పదో స్థానం దక్కింది.
ఆర్మాక్స్ సర్వేకు ఇతర సంస్థల సర్వేలతో పోల్చి చూస్తే ప్రేక్షకుల్లో ఒకింత ట్రస్ట్ ఉంది.టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు.