చిన్న కొడుకు బారన్ ట్రంప్ భవిష్యత్తు ప్రణాళికలివే : డొనాల్డ్ ట్రంప్

రిపబ్లికన్ పార్టీ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను అధికారికంగా పొందిన ఆయన .

 Donald Trump Reveals His Youngest Son Barron Trumps Plans After Graduation , Do-TeluguStop.com

కోర్టు కేసులను ఎదుర్కొంటూనే ప్రచారంలోనూ పాల్గొంటున్నారు.వయసు రీత్యా ట్రంప్ కొన్నేళ్ల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సిందే.

ఈలోగా తన వారసులను సైతం రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.

Telugu Barron Trump, Donald Trump, Florida, Oxbridge, Presidential, Republican-T

ఈ నేపథ్యంలో తన చిన్న కుమారుడు బారన్ ట్రంప్( Barron Trump) భవిష్యత్తుకు సంబంధించి కీలక విషయాలను పంచుకున్నారు డొనాల్డ్ ట్రంప్.ఆక్స్‌బ్రిడ్జ్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ చేయడానికి సిద్ధంగా వున్న బారన్.గతంలో ఊహించిన దానికంటే భిన్నమైన కళాశాలలను పరిశీలిస్తున్నట్లుగా నివేదించబడింది.

గతంలో తన తండ్రి, తోబుట్టువుల అడుగుజాడల్లో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో బారన్ చేరతారని ప్రచారం జరిగింది.ట్రంప్ టవర్‌లోని అతని చిన్న నాటి నివాసానికి దగ్గరగా.

బహుశా న్యూయార్క్ యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాల కోసం మాన్‌హట్టన్‌కు తిరిగి వచ్చే అవకాశం వుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Telugu Barron Trump, Donald Trump, Florida, Oxbridge, Presidential, Republican-T

తన కుమారుడి అకాడెమిక్ పనితీరుపై డొనాల్డ్ ట్రంప్ గర్వపడుతున్నట్లుగా తెలిపారు.త్వరలోనే బారన్ కాలేజీకి వెళ్లబోతున్నాడని, తాము కొన్ని కళాశాలలను పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.అయితే ట్రంప్ రాజకీయాల నేపథ్యంలో బారన్‌పై అందరి దృష్టి నెలకొంది.

ఇన్నేళ్లుగా అతను బయటి ప్రపంచానికి దూరంగా వున్నాడు.ఆక్స్‌బ్రిడ్జ్‌లో( Oxbridge university ) బారన్ చదువుతున్న విషయం, ఇతర అంశాలు ప్రైవేట్‌గా ఉంచారు.

విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అతని గురించి చెప్పడానికి నిరాకరించారు.బారన్ ఎంతో జనాదరణ పొందారని .అప్పుడప్పుడు తనకు రాజకీయ సలహాలు కూడా ఇస్తాడని ట్రంప్ పేర్కొన్నారు.ఇదిలావుండగా బారన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని గత కొద్దిరోజులుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా పంపనున్నట్లుగా పార్టీ ఛైర్మన్ ఇవన్ పవర్ ఇటీవల వెల్లడించారు.ఈ మార్చిలోనే బారన్‌కు 18 ఏళ్లు వచ్చాయి.వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానం సైతం అనుమతి ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube