తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu) ఏపీ గవర్నర్ నజీర్ కి వరుస పెట్టి లేఖలు రాస్తున్నారు.రెండు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం చివరి నిమిషంలో చేసే బిల్లుల చెల్లింపులను ఆపాలని లేఖ రాయడం జరిగింది.
ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ చర్యలను నిలిపేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్( AP Governor Nazir ) కి లెటర్ రాయడం జరిగింది.ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ-ఆఫీస్ మూసివేతపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.
కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ్ళ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ అవసరం లేదు.ఫైల్స్, నోటీస్ ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలి.
అన్ని హెచ్ఒడి కార్యాలయాల్లో.సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లేఖలో కోరడం జరిగింది.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తారీఖు విడుదల కానున్నాయి.ఈ క్రమంలో గెలుపు విషయంలో చంద్రబాబు చాలా ధీమాగా ఉన్నారు.2024 ఏపీ ఎన్నికలు( 2024 AP Elections ) పోటా పోటీగా జరిగాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మొత్తం 81.86% పోలింగ్ నమోదయింది.గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు రావడానికి ప్రధాన కారణం.ప్రభుత్వ వ్యతిరేకత అని బలంగా నమ్ముతున్నారు.దీంతో కూటమి పార్టీల నాయకులు కచ్చితంగా తామే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని భావిస్తున్నారు.