ఏపీ ఎన్నికల సమయంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు( Nagendra Babu ) ట్విట్టర్ అకౌంట్ లో కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తూ కీలక పాయింట్స్ లేవనెత్తేవారు.
ఇదే సమయంలో జనసేన పార్టీ (Janasena party)కార్యకర్తలకు లేదా అభిమానులకు సోషల్ మీడియా ద్వారానే పలు సూచనలు చేసేవారు.ఏపీ ఎన్నికల ప్రచారంలో జనసేన పోటీ చేసే అనేక చోట్ల నాగబాబు విస్తృతంగా పర్యటించారు.
ఒకపక్క పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ మరోపక్క కూటమి పార్టీల నేతలను కలుపుకుంటూ పోతూ… ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో సరిగ్గా పోలింగ్ రేపు అనగా.
దానికి ముందు రోజు ట్విట్టర్ లో నాగబాబు చేసిన ఓ ట్వీట్.విపరీతంగా వైరల్ అయింది.
“మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మా వాడైనా పరాయి వాడే.మాతో నిలబడే వాడు పరాయివాడైనా… మా వాడే” అంటూ నాగబాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది అన్నది ఎవరికి అర్థం కాలేదు.ఎలక్షన్ ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్( Allu Arjun ) తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం కర్నూల్ లో పర్యటించడం జరిగింది.
అదేరోజు పిఠాపురంలో రామ్ చరణ్( Ram Charan ).తన తల్లి సురేఖ మామ అల్లు అరవింద్ తో కలసి పిఠాపురంలో పర్యటించారు.దీంతో నాగబాబు.పెట్టిన ట్విట్ మెగా అభిమానులను గందరగోళానికి గురి చేయటం జరిగింది.దీని ఆధారం చేసుకుని విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉండటంతో.నాగబాబు అప్రమత్త మైనట్టు తెలుస్తోంది.
దీంతో నాగబాబు తన అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీసింది.