సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, టెక్నీషియన్లకు కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం దక్కదు.స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సినిమాకు ముందు సీరియళ్లు, సినిమాలలో నటించారు.
అయితే ఆ సమయంలో యశ్ కు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే ఉండగా కేజీఎఫ్ సిరీస్ తర్వాత పరిస్థితి మారిపోయింది.ప్రస్తుతం యశ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarathkumar ) క్రాక్ సినిమాకు ముందు తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా ఆ సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.అయితే క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.
ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ మంచి గుర్తింపును సొంతం చేసుకోగా ఈ సినిమాకు ముందు సిద్ధు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలతో ఆశించిన గుర్తింపు దక్కలేదు.డీజే టిల్లు సక్సెస్ తో సిద్ధు ఇమేజ్ సైతం మారిపోయింది.హనుమాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి గతంలో ఎన్నో సినిమాలకు పని చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిందనే సంగతి తెలిసిందే.

హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మలకు కూడా హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో మంచి గుర్తింపు వచ్చింది.ఓవర్ నైట్ లో సెలబ్రిటీ స్టేటస్ రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి.యానిమల్ సినిమాతో నటి త్రిప్తీ డిమ్రీకి సైతం ఈ సినిమాతో పాపులారిటీ దక్కింది.వైష్ణవి చైతన్య ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బేబీ సినిమాతో దక్కింది.







