చనిపోయిన చిన్నారి సమాధి వద్ద లేచింది.. తర్వాత ఏమైందంటే..??

సాధారణంగా మనుషుల పుట్టుక, చావు రెండూ ఒక్కసారి మాత్రమే సంభవిస్తాయి.కానీ మెక్సికో( Mexico ) దేశంలో ఒక చిన్నారి విషయంలో ఇది అబద్ధమని తేలింది.

 The Dead Child Woke Up At The Grave.. What Happened Next, Mexico, San Luis Potos-TeluguStop.com

సాన్ లూయిస్ పోటోసి రాష్ట్రంలోని సాలినాస్ డి హిల్డాల్గో కమ్యూనిటీ హాస్పిటల్‌లో ఈ సంఘటన జరిగింది.కామిలా రోక్సానా మార్టినెజ్ మెండోజా ( Camila Roxana Martinez Mendoza )అనే మూడేళ్ల చిన్నారి ఇటీవల వాంతులు, కడుపు నొప్పి, జ్వరంతో బాగా సఫర్ అయ్యింది.

దాంతో ఆమె తల్లి మేరీ జేన్ మెండోజా ఆమెను వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళారు.వారి స్వస్థలమైన విల్లా డి రామోస్ లోని ఒక పిల్లల వైద్యుడు వారిని కమ్యూనిటీ హాస్పిటల్‌కు పంపించారు.

అక్కడ కామిలాకు డీహైడ్రేషన్‌ కోసం చికిత్స చేసి పారాసెటమాల్ మందు ఇచ్చారు.కానీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు.

Telugu Camilaroxana, Funeral Awake, Mexico, Nri, San Luis Potosi-Latest News - T

కామిలా ప్రాణాలను రక్షించడం కోసం ఆమె తల్లిదండ్రులు మరొక వైద్యుడిని సంప్రదించారు.ఆ డాక్టర్ ఆమెకు పండ్లు, నీరు, మందుల మోతాదు మార్పు ఇవ్వమని సలహా ఇచ్చారు.కానీ వారి ప్రయత్నాలన్నీ ఫలించలేదు, కామిలా ఆరోగ్యం మరింత దిగజారింది.దీంతో వారు మళ్లీ అదే హాస్పిటల్‌కు వెళ్లారు.అక్కడ వైద్యులు ఆమెకు నరం ద్వారా మందులు ఇవ్వడానికి ప్రయత్నించారు.కానీ ఆమె చిన్న సిరలను కనుగొనడం కష్టంగా ఉండడంతో ఆ ప్రక్రియ ఆలస్యమైంది.

చివరికి ఒక నర్సు సిర ద్వారా మందులు ఇవ్వడంలో విజయం సాధించింది.

Telugu Camilaroxana, Funeral Awake, Mexico, Nri, San Luis Potosi-Latest News - T

కానీ దురదృష్టవశాత్తు, కామిలా మరణించింది.ఆమె మరణానికి కారణం నిర్జలీకరణ అని వైద్యులు ప్రకటించారు.కామిలా మరణం ఆమె తల్లిదండ్రులకు తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది.

వారు ఆమె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కామిలా అంత్యక్రియల సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది.

తల్లి మేరీ శవపేటికలో అసాధారణ పొగను గమనించింది, కానీ ఇతరులు దానిని విచారం వల్ల కలిగిన భ్రమ అని తోసిపుచ్చారు.అయితే, కామిలా కళ్ళు కదులుతున్నాయని ఆమె అమ్మమ్మ గమనించినప్పుడు, భయం చెలరేగింది.

కుటుంబ సభ్యులు ఆమె నాడిని తనిఖీ చేసి, ఆమె ఇంకా బతికే ఉందని గ్రహించారు.ఆమెను తిరిగి ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని డాక్టర్లు చెప్పారు.

అదేంటంటే కామిలా రెండోసారి మరణించినట్లు ప్రకటించారు.దాంతో వారు మరోసారి గుండె పగిలారు.

అసలు ఇది ఎలా జరిగిందని బంధువులతో సహా మిగతా వారందరూ కూడా షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube