అతని వల్లే విధ్వంసం అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..!!

మే 13వ తారీకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి.అయితే ఎన్నికల ముగిసిన అనంతరం రాష్ట్రంలో భయానక వాతావరణం చోటుచేసుకుంది.

 Police Observer Deepak Mishra Called Perni Nani Sensational Comments As Vandalis-TeluguStop.com

పల్నాడు, అనంతపురం ప్రాంతాలలో వైసీపీ…టీడీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.పల్నాడులో ఎన్నడూ లేని విధంగా.

బాంబులు విసురుకోవటం జరిగింది.దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది.

తమ పార్టీకి ఓటు వేయలేదని కొన్ని వర్గాలకు చెందిన ఇళ్లపై నాయకులు దాడులు చేశారు.అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం( Tadpatri Assembly constituency )లో కూడా… భయానక వాతావరణం నెలకొంది.

ఏపీలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఎలక్షన్ కమిషన్… డీజీపీ, చీఫ్ సెక్రటరీ లను ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం జరిగింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు… దాడులు జరుగుతున్న ప్రాంతాలలో 144 సెక్షన్ విధించడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై వైసీపీ నేత పేర్ని నాని( Perni nani ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉద్దేశపూర్వకంగానే పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను.ఎన్నికల కోసం తీసుకొచ్చారని ఆరోపించారు.మిశ్రా రాష్ట్రానికి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన రిటైర్డ్ అధికారులను కలిశారు.జిల్లా ఎస్పీలను కూడా ఆయన బెదిరిస్తున్నారు.పోలింగ్ పూర్తయిన రాష్ట్రం వదిలి వెళ్ళటం లేదు.

దీపక్ మిశ్రా వల్లే రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.తక్షణమే ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube