నాగబాబు ట్వీట్ పై స్పందించిన శిల్పా రవి.. ఏమన్నారంటే?

సినీ నటుడు నాగబాబు( Nagababu ) ఇటీవల పరోక్షంగా అల్లు అర్జున్( Allu Arjun ) ని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.మా వాడైనా ప్రత్యర్థుల కోసం పనిచేస్తున్నారంటే వాడు పరాయి వాడే పరాయివాడైన మా పక్కన నిలబడితే మా వాడే అంటూ ఒక ట్వీట్ చేశారు.

 Ycp Candidate Shilpa Ravi React On Nagababu Tweet, Nagababu, Shilpa Ravi ,allu-TeluguStop.com

అయితే ఇది ఈయన ఎవరిని ఉద్దేశించి చేశారో అనే విషయం మాత్రం వెల్లడించలేదు.కానీ ఈ విషయం మాత్రం తప్పకుండా అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.

Telugu Allu Arjun, Nagababu, Nagababu Tweet, Pawan Kalyan, Shilpa Ravi, Tollywoo

అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపిన తన స్నేహితుడు శిల్పా రవికి ( Shilpa Ravi ) మాత్రం స్వయంగా నంద్యాలకు వెళ్లి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో మద్దతు తెలియజేశారు.దీంతో తప్పనిసరిగా అల్లు అర్జున్ ఉద్దేశించే నాగబాబు ఇలాంటి ట్వీట్ చేశారని అర్థమవుతుంది.అయితే ఈ విషయంపై నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, బన్నీ స్నేహితుడు శిల్పా రవి స్పందించారు.

Telugu Allu Arjun, Nagababu, Nagababu Tweet, Pawan Kalyan, Shilpa Ravi, Tollywoo

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నాగబాబు గారు ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయం స్పష్టంగా తెలియలేదు.కానీ ఒకవేళ ఆయన బన్నీని ఉద్దేశించి అలాంటి ట్వీట్ చేశారు అంటే అది ఆయన సంస్కారానికి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.కేవలం బన్నీ స్నేహబంధం తోనే ఇక్కడికి వచ్చారని రవి తెలిపారు.

అంతేకాకుండా ఓటింగ్ రోజు కూడా నాకు పార్టీలతో సంబంధం లేదు నా స్నేహితులు ఏ రంగంలో ఉన్నా కూడా నేను వారికి సపోర్ట్ చేస్తానని చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ ఈయన బన్నీని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశారు అంటే ఆయన స్వభావం ఏంటో అర్థం అవుతుంది.ఒకవేళ ఆ కామెంట్స్ బన్నీని ఉద్దేశించి అయితే ఆయన సంస్కారానికి అది వదిలేస్తున్నామంటూ శిల్పా రవి ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube