ఈ ఒక్కటి డైట్ లో ఉంటే అజీర్తి ద‌రిదాపుల్లోకి కూడా రాదు!

అజీర్తి.అత్యంత సర్వసాధారణంగా మదన పెట్టే జీర్ణ సమస్యల్లో ఒకటి.

అయితే అజీర్తి అనేది అప్పుడప్పుడు ఇబ్బంది పెడితే ఎలాంటి సమస్య ఉండదు.

కానీ కొందరు తరచూ అజీర్తికి గురవుతుంటారు.

దీంతో ఆకలి చచ్చిపోతుంది.ఒకవేళ ఏదైనా తినాలని కోరిక పుట్టినా సరే అజీర్తికి భయపడి వెనకడుగు వేస్తుంటారు.

అజీర్తి వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.

Advertisement

ఈ క్రమంలోనే అజీర్తి సమస్య( Indigestion problem ) నుంచి బయటపడేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే హెల్తీ జ్యూస్ డైట్ లో ఉంటే అజీర్తి అన్న మాటే అనరు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా పైనాపిల్ ను తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో క‌డిగి ముక్కలుగా కట్ చేయాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పైనాపిల్ ముక్కలు( Slices of pineapple ), ఒక కప్పు క్యారెట్ ముక్కలు( Carrot slices ), ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు( Fresh mint leaves ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి సేవించాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ జ్యూస్ ను రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజు తీసుకోవాలి.

Advertisement

తద్వారా పైనాపిల్, క్యారెక్టర్ లో ఉంటే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.ఫలితంగా అజీర్తితో సహా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత స‌మస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.తరచూ అజీర్తితో బాధపడేవారికి ఈ డ్రింక్ బెస్ట్ న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.

పైగా ఈ హెల్తీ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్‌ అవుతారు.రక్తహీనత దూరం అవుతుంది.మ‌రియు గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.

తాజా వార్తలు