ఆ 3500 రూపాయలు నేనే అడిగాను.. వైరల్ అవుతున్న రేణూ దేశాయ్ కామెంట్స్!

టాలీవుడ్ నటి,పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.

 Renu Desai Gives Clarity On Her Instagram Post Video Goes Viral Details, Renu De-TeluguStop.com

ముఖ్యంగా తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తనకు తన పిల్లలకు సంబంధించిన వార్తలు వినిపించిన వెంటనే వాటిని స్పందిస్తూ ఉంటుంది.

తనపై నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది రేణు దేశాయ్.

ఇకపోతే ఇటీవలే ఆమె అకిరా ( Akira ) కర్రసాము చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల తన ఇన్ స్టాలో క్యూఆర్ కోడ్( QR Code ) షేర్ చేస్తూ విరాళాలు ఇవ్వాలంటూ కోరింది.రేణు దేశాయ్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.

రేణు దేశాయ్ విరాళాలు కావాలని అడగమేంటీ? అసలు ఏం జరిగింది ? ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందా ? అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్స్.తాజాగా తన ఇన్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చింది రేణు.

ఇన్ స్టాలో విరాళాలు( Donations ) కావాలని పోస్ట్ పెట్టింది నేనే అంటూ క్లారిటీ ఇచ్చింది.తన అకౌంట్ హ్యాక్ కాలేదని అలాగే విరాళాలు అందించి మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.కొద్దిరోజులుగా తన ఆరోగ్యం బాలేనందున ఈ వీడియో చేయలేకపోయానంటూ క్లారిటీ ఇచ్చింది.కొద్ది రోజులుగా నా ఆరోగ్య బాలేదు.అందుకే వీడియో చేయలేదు.కానీ రూ.3500 కావాలంటూ పోస్ట్ పెట్టింది మాత్రం నేను.నా అకౌంట్ ఎవరు హ్యాక్ చేయలేదు.

నేను కూడా రెగ్యులర్ గా డొనేట్ చేస్తాను.

కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది.డొనేషన్స్ కు నా డబ్బులంతా ఇచ్చేస్తే.నా పిల్లల కోసం కావాలి కదా.నా వరకు సాయం చేశాక.ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ ను అడుగుతున్నాను.

యానిమల్స్, చిన్నారుల కోసం నేను విరాళాలు ఇస్తున్నాను.అదే నా ఫైనల్ టార్గెట్.

త్వరలోనే వాటి కోసం ఓ షెల్టర్ నిర్మిస్తాను.అప్పుడు నేను అందరిని అధికారికంగా విరాళాలు సేకరిస్తాను.నా రిక్వెస్ట్ కు రియాక్ట్ అయ్యి రూ.3500 పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube