జాన్వీ కపూర్ ఎంట్రీతో ఆ హీరోయిన్ కు ఆఫర్లు తగ్గాయట.. అయ్యో పాపం అంటూ?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయంలో ఉన్నంత పోటీ హీరోల విషయంలో ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఎందుకంటె ఒక హీరోయిన్ త్వరగా క్లిక్ అయింది అంటే చాలు ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి.

 Janhvi Becomes Threat To Kiara, Janhvi Kapoor, Bollywood, Kiara Advani, Movie Ch-TeluguStop.com

అంతేకాకుండా హీరోయిన్ క్లిక్ అయిందంటే, ఇద్దరు హీరోయిన్ల కెరీర్ ఇరకాటంలో పడ్డట్టే అని చెప్పవచ్చు.మిగతా పరిశ్రమల సంగతి పక్కన పెడితే, టాలీవుడ్ లో మాత్రం ఇదే కల్చర్ కొనసాగుతోంది.

పైగా ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.దీంతో ఒక హీరోయిన్ క్లిక్ అయితే, మిగతా హీరోయిన్లకు గుండె దడ పట్టుకుంటోంది.

Telugu Bollywood, Chiranjeevi, Devara, Janhvi Kapoor, Kiara Advani, Ram Charan-M

చివరికి కియరా అద్వానీ( Kiara Advani ) లాంటి హీరోయిన్ కు కూడా ఈ పాట్లు తప్పడం లేదు.ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో బాలీవుడ్ తో సమానంగా క్రేజ్ ఉంది ఈ బ్యూటీకి.ఒక పెద్ద సినిమా కార్యరూపం దాలిస్తే హీరోయిన్ గా కియరా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.కానీ ఇప్పుడా స్థానాన్ని మెల్లమెల్లగా జాన్వీ కపూర్ ఆక్రమిస్తోంది.దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది జాన్వీ కపూర్.చేస్తున్నది ఒక సినిమానే అయినప్పటికీ చర్చల్లో మాత్రం చాలా సినిమాల్ని పెండింగ్ లో పెట్టింది.

Telugu Bollywood, Chiranjeevi, Devara, Janhvi Kapoor, Kiara Advani, Ram Charan-M

ఇందులో భాగంగా రామ్ చరణ్( Ram Charan ) తో సినిమాను లాక్ చేసింది.త్వరలోనే మరో పెద్ద సినిమాను ప్రకటించబోతోంది.అయితే జాన్వీ రాకతో కియరా అద్వానీ తన కెరీర్ ప్లాన్స్ మార్చుకోవాల్సి వచ్చింది.ఏటా హిందీ, తెలుగు భాషల్లో చెరో సినిమా చేయాలనేది ఈమె ప్లాన్.కాని జాన్వీ రాకతో పెద్ద సినిమాలు కియరా చేజారిపోతున్నాయి.దీంతో టాలీవుడ్ లో చిన్న గ్యాప్ తీసుకోవాలని భావిస్తోంది కియరా.

ఈ గ్యాప్ లో ఓ హిందీ సినిమా లేదా తమిళ సినిమాకు కాల్షీట్లు ఇవ్వాలనుకుంటోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube