కాలం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది, తనతోపాటు మారడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొమ్మని చెప్పకనే చెబుతుంది.మారితే ఒకే లేదంటే అంతే సంగతులు చరిత్రలో కలిసి పోవాల్సిందే అలా కాలంతో పాటు మారలేక చరిత్ర లో కలిసిపోయిన ఒక విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆ విషయం మరేదో కాదు నోకియా.మీకు నోకియా 1100 ఫోన్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి.
ఆ ఫోన్ అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా 2003లో అమ్ముడుపోయిన మొబైల్స్ లో ఒకటిగా సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడింది.వ్యాపార రంగంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థ గా వేనోళ్ల కొనియాడిన నోకియా ప్రస్తుతం ఎక్కడ ఉంది ? మరి నోకియా పతనానికి కారణాలు ఏంటి ? అనేది ఈ ఇప్పుడు తెలుసుకుందాం.
నోకియా నిజానికి 1998 నుంచి 2003 వరకు ఆ సమయంలో అగ్రభాగంకి కొనసాగింది.అంతే కాదు 2005, 2006 వరకు కూడా నోకియా తన ప్రభావాన్ని బాగానే చూపించింది.2007వ సంవత్సరంలో ఐ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది ఆ సమయానికి నోకియా 50 శాతం మార్కెట్ నుంచి దాదాపు 5 శాతానికి పడిపోయింది.ఇదే ఆ సంస్థకి మొదటి దెబ్బ.2011 వచ్చేసరికి 90 శాతానికి పైగా పడిపోయింది.నోకియా నిజానికి మొదటగా స్మార్ట్ఫోన్ మొదలుపెట్టింది.
కానీ ఇదొక ఫెయిల్యూర్ ఆపరేటింగ్ సిస్టంపోటీలో వెనకబడింది.వాస్తవానికి ఆండ్రాయిడ్ సిస్టం వైపు వెళ్లే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వైపు వెళ్లాల్సిన అవసరం వచ్చిన తరుణంలో 2008లో ఆ సంస్థ మేనేజ్మెంట్ ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం ఆ సంస్థ ఈ రోజు పతనం కావడానికి మరొక ముఖ్యమైన కారణం.
ఆ సంస్థ 2010లో ఎలాఫ్రీ ని నోకియా సీఈవో గా చేశారు అతను సైతం ఈ కంపెనీ ని కాపాడలేకపోయాడు.ఆ తర్వాత కాలంలో మైక్రోసాఫ్ట్ 2013లో నోకియా అని తన హస్తగతం చేసుకుంది ఇక్కడ నోకియా పూర్తిగా పతనమైపోయింది.
వాస్తవానికి నోకియా చేసిన మొదటి తప్పు అసలు ఎవరి మాట వినకపోవడం.కిందిస్థాయి మేనేజ్మెంట్ కి ఏం చెప్పినా వినక పోవడం వల్లే ఆ సంస్థ ఈ రోజు నామరూపాలు లేకుండా పోయింది.
ఇక 2013లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల వచ్చారు అంతకుముందు వరకు బిల్ గేట్స్ ఆ స్థానంలో ఉన్నారు.అలా నోకియా పూర్తిగా అంతం అయిపోయింది.ఇలా ఎంతోమంది చరిత్రలో కలిసిపోయారు టాటా బిర్లా నే చూసుకోండి టాటా ఈరోజు ఎంతో పెద్ద స్థాయిలో ఉంది కానీ బిర్లా పడిపోతుందని చెప్పాలి.అహంకారం నోకియాను నాశనం చేయడమే కాదు నామరూపాలు లేకుండా చేసింది.